NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

* హరారే: నేడు భారత్-జింబాబ్వే మధ్య తొలి టీ20.. సాయంత్రం 4.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం

* హైదరాబాద్‌: నేడు సాయంత్రం 6 గంటలకు ఏపీ, తెలంగాణ సీఎంల సమావేశం.. ప్రజాభవన్‌లో భేటీకానున్న ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి..

* నేటి సీఎంల సమావేశంలో తెలంగాణ డిమాండ్స్: టీటీడీ మెంబర్స్ లో తెలంగాణ వాటా.. భద్రాచలంలో 7 మండలాలు ఇవ్వాలి.. కృష్ణపట్నం పోర్టులో వాటా.. సముద్ర తీరంలో తెలంగాణ తీరప్రాంత వాటా.. టీటీడీలో 42: 58 శాతం వాటా కావాలని అడగనున్న తెలంగాణ..

* తిరుమల: 9, 16వ తేదీల్లో శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. 9వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 16వ తేదీ ఆణివార ఆస్థానం సందర్భంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ..

* తిరుమల: 9వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో అష్టదళపాదపద్మారాధన సేవను రద్దు చేసీన టీటీడీ.

* తిరుమల: 16వ తేదీన శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం.. ఈ సందర్భంగా సాయంత్రం పుష్పపల్లకీలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి

* నేటి నుంచి కడప జిల్లాలో మూడు రోజులు పర్యటించనున్న మాజీ సీఎం వైఎస్ జగన్.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకులకు హాజరుకానున్న జగన్.. ఈ నెల 8వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఇడుపులపాయలో ఘనంగా నిర్వహణకు ఏర్పాట్లు.. 6,7 ,8 మూడు రోజులు జిల్లాలోనే మకాం వేయనున్న జగన్..

* నెల్లూరు జిల్లా: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరిస్తారు

* తూర్పుగోదావరి జిల్లా: రేపు రాజమండ్రిలో జగన్నాథ రథయాత్ర.. రాజమండ్రి గౌతమి ఘాట్ లోని ఉన్న ఇస్కాన్ మందిరం ఆధ్వర్యంలో జరుగునున్న రథయాత్ర.. భారీగా భద్రత ఏర్పాట్లు

* ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్న శాస్త్రవేత్తల బృందం. జిల్లాలో చీనీ తోటలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్న బృందం సభ్యులు.

* అనంతపురం : నార్పల మండలం గూగూడు గ్రామంలో ఈనెల 7 నుంచి కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలు.

* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజానగరం నియోజకవర్గంలోని తొర్రిగడ్డ ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సాగునీరు విడుదల.. తొలి రోజు 300 క్యూసెక్కుల నీరు విడుదలకు సన్నాహాలు చేస్తున్న ఇరిగేషన్ అధికారులు

* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజానగరం నియోజకవర్గంలో సీతానగరం మండలం ఎంపీడీవో కార్యాలయంలో సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం.. ఉదయం 11 గంటల నుండి కార్యక్రమం..

* బాపట్ల : మంత్రి గొట్టిపాటి రవికుమార్ అడ్డంకిలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు..

* బాపట్ల : వేటపాలెంలో ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్యకు పౌర సన్మాన కార్యక్రమం..

* వరంగల్ జిల్లా: నేటి నుండి 21వ తేదీ వరకు భద్రకాళి అమ్మవారు శాఖాంబర ఉత్సవాలు .. ఘనంగా ఏర్పాట్లు చేసిన దేవాదాయ శాఖ అధికారులు

Show comments