Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* నేడు కార్తీక పౌర్ణమి.. శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో భక్తుల పూజలు.. వంగల్ జిల్లాలోని ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. వేయిస్తంభల గుడి, రామప్ప, కాళేశ్వరం, సిద్ధేశ్వరాలయం, కోటగుల్ల, పాలకుర్తి సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు.. కాళేశ్వరం త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు..

* నేడు అన్నవరం సత్యదేవుని గిరి ప్రదక్షణ.. 9 కిలోమీటర్ల మేర సాగనున్న గిరి ప్రదక్షణ.. పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసిన దేవాదాయశాఖ.. ఉదయం 8గంటలకు పల్లకిలో మధ్యాహ్నం 2గంటకి సత్యరథంపై విడతలుగా గిరి ప్రదక్షణ.. సుమారు 3 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా..

* నేడు ఐదో రోజుకు చేరుకున్న భక్తి టీవీ ఆధ్వర్యంలో కోటి దిపోత్సవం.. మహాదేవునికి అన్నాభిషేకం, ఉజ్జయిని మహాకాళుని భస్మ హారతి.. శ్రీ అరుణాచలేశ్వర స్వామి కళ్యాణం..

* నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార షెడ్యూల్ లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి.. సాయంత్రం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ప్రచారం చేయనున్న సీఎం రేవంత్..

* నేడు జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ జోరుగా ప్రచారం.. మాగంటి సునీత తరపున ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్..

* నేడు జూబ్లీహిల్స్ లో బీజేపీ ప్రచారం.. కమలం పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం చేయనున్న కిషన్ రెడ్డి..

* నేడు కొత్త జిల్లాల ఏర్పాటుపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. మధ్యాహ్నం సచివాలయంలో సమావేశం కానున్న కేబినెట్ సబ్ కమిటీ.. జిల్లాలు, డివిజన్లు, మండలాలు, గ్రామాల పేర్లు మార్పులు, చేర్పులపై చర్చ.. ఈ నెల 10న కేబినెట్ సమావేశంలో జిల్లాల పునర్విభజనపై నిర్ణయం.. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో అయిన కేబినెట్ సబ్ కమిటీ..

* నేడు విశాఖలో జరగనున్న సీఐఐ సదస్సుపై మంత్రి లోకేష్ సమీక్ష.. భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లపై అధికారులతో చర్చ..

* నేడు విశాఖలో మంత్రి బాలవీరంజనేయస్వామి పర్యటన.. సీఐఐ సదస్సు ఏర్పాట్లను పరిశీలించనున్న మంత్రి డోలా..

* నేడు శ్రీకాకుళం జిల్లాలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరుకానున్న రామ్మోహన్..

* నేడు కేసిరెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ.. ఏసీబీ కోర్టులో పిటిషన్ డిస్మిస్ చేయడంతో.. హైకోర్టుకు వెళ్లిన కేసిరెడ్డి..

* నేడు మోడీని కలవనున్న భారత మహిళల క్రికెట్ ప్లేయర్స్.. భారత మహిళల క్రికెట్ జట్టును అభినందించనున్న ప్రధాని..

Exit mobile version