నేడు ఏపీ హైకోర్టులో నారా చంద్రబాబు, నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్లు విచారణ జరగనుంది. ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్, స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్లు మీద ఏపీ హైకోర్టు విచారణ జరపనుంది.
ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నేడు సీఐడీ విచారణకు రావాలన్న నోటీసులపై తన ఇంటి వద్దే విచారణ చేయాలని మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.
నేడు పెడనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన జరగనుంది. పెడనలో భారీ సభను జనసేన నేతలు నిర్వహించనున్నారు. పెడనలో దాడులు జరుగుతాయని పవన్ వ్యాఖ్యల నేపద్యంలో పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నేడు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జరగనుంది. జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరేష్ ల ధర్మాసనం విచారణ చేపట్టనుంది. 2017లో ఓటుకు నోటు కేసులో ఏపి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి రెండు పిటిషన్లు వేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. తెలంగాణ ఏసీబీ నుంచి కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ మరో పిటిషన్ కూడా దాఖలు అయింది.
నేడు చిన్న పెండెకల్లులో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏపీ సీఎం వైఎస్ జగన్ వర్చువల్ గా ప్రారంభించనున్నారు.
Also Read: ICC Cricket World Cup: సెమీస్ చేరే నాలుగు జట్లు ఇవే.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు దక్కని చోటు!
నేడు కామారెడ్డి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన జరగనుంది. బాన్సువాడలో పలు అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపనలు చేయనున్నారు. ఆపై బీఆర్ఎస్ ఆత్మీయ కృతజ్ఞత సభలో కేటీఆర్ ప్రసంగించనున్నారు.
నేడు పాలమూరు జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. కోస్గి, మక్తల్, కొత్తకోట మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన పాల్గొంటారు. అనంతరం బహిరంగ సభల్లో మంత్రి మాట్లాడుతారు.
