NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

*నేడు తిరుపతి జిల్లాలో హోంమంత్రి అనిత పర్యటన.. హత్యకు గురైన చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించనున్న అనిత.. ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి రూ.10 లక్షల సాయం అందించనున్న అనిత.. మధ్యాహ్నం పద్మావతి మహిళా వర్సిటీలో రాయలసీమ డీఐజీతో సమీక్ష.

*నంద్యాల: నేడు ముచ్చుమర్రిలో వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల పర్యటన.. హత్యకు గురైన బాలిక(9) కుటుంబాన్ని పరామర్శించి చెక్కు అందజేయనున్న నేతలు.. ఇప్పటికే బాలిక కుటుంబానికి రూ.10 లక్షల చెక్కు అందజేసిన ప్రభుత్వం.

*నేడు ఖమ్మం జిల్లాలో మంత్రులు తుమ్మల, పొంగులేటి పర్యటన.

*తిరుమల: శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 88,076 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 36,829 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.52 కోట్లు

*తిరుపతి: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ ప్రమాణస్వీకారం.. తిరుపతి శివారులో భారీ బహిరంగ సభ ఏర్పాటు.. సభకు హాజరుకానున్న బొత్స, రోజా, ఇతర వైసీపీ నేతలు.

*నేడు నెల్లూరు జిల్లాలో మంత్రులు ఫరూక్, ఆనం, నారాయణ పర్యటన.

*శ్రీసత్యసాయి: నేడు పెనుకొండలో టీడీపీ కార్యకర్తల సమావేశానికి మంత్రి సవిత.

*అన్నమయ్య: నేడు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశం.

*నేడు తూర్పుగోదావరి జిల్లాలో మంత్రి కందుల దుర్గేష్ పర్యటన

*కార్తీకమాసం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు.. ఆదివారం కావడంతో మహాదేవుడి దర్శనానికి మరింత పెరిగిన రద్దీ.. నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదులుతున్న మహిళలు.. స్వామివారిని దర్శించుకుని కార్తీక దీపాలు వెలిగిస్తున్న భక్తులు.. శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు.

*నేటి నుంచి ఆరు నెలల పాటు కేదార్‌నాథ్ ఆలయం మూసివేత

*తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,700.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,400.. కిలో వెండి ధర రూ.1,06,000.

Show comments