Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* నేటి నుంచే మహిళల వన్డే ప్రపంచకప్‌ 2025 ఆరంభం.. భారత్‌ ఆతిథ్యమిస్తున్న మెగా టోర్నీ గువాహటిలో నేటి నుంచి ఆరంభం.. తొలి మ్యాచ్‌లో శ్రీలంక- భారత్ ఢీ

* చెన్నై: తొక్కిసలాట ఘటనపై మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేసిన హీరో విజయ్ టీవీకే పార్టీ.. పోలీసుల లాఠీఛార్జ్‌, కుట్ర వల్లే తొక్కిసలాట జరిగిందని, ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని టీవీకే పిటిషన్.. నేడు టీవీకే పిటిషన్‌పై విచారణ జరుపనున్న హైకోర్టులోని మధురై బెంచ్.

* నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్.. ఇప్పటికే ఢిల్లీ చేరిన ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్.. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్‌తో భేటీకానున్న సీఎం చంద్రబాబు.. సాయంత్రం సీఐఐ పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.

* ఇవాళ ఢిల్లీకి మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలవనున్న ఉత్తమ్

* అమరావతి: ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో అంబేడ్కర్ విగ్రహాల వద్ద వైసీపీ నిరసనలు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసనగా పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు..

* నెల్లూరు జిల్లాలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటన.. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి సారేను సమర్పించనున్న మంత్రి.. మూలపేట శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో అభివృద్ధి పనుల పరిశీలన. సాయంత్రం ఆత్మకూరు R & B గెస్ట్ హౌస్ వద్ద స్థానిక అధికారులతో సమావేశం..

* విజయవాడ: ఇంద్రకీలాద్రిపై నేడు తొమ్మిదవ రోజు దసరా ఉత్సవాలు.. నేడు శ్రీ దుర్గా దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్న అమ్మవారు

* నేడు కాకినాడ చేరుకోనున్న నలుగురు మత్స్యకారులు.. నేవిగేషన్ లో వచ్చిన సమస్యతో ఆగస్టు 4న శ్రీలంక జలాల్లో కి వెళ్ళిపోయిన నలుగురు మత్స్యకారులు.. కోర్టు ఆదేశాలు మేరకు జాప్నా జైలు లో నలుగురు మత్య్సకారులు ను ఉంచిన శ్రీలంక అధికారులు.. భారత ప్రభుత్వం సంప్రదించడంతో నలుగురు మత్స్యకారులను వదిలిపెట్టిన శ్రీలంక కోస్ట్ గార్డ్

* తూర్పుగోదావరి జిల్లా: గోదావరి పరవళ్లు తొక్కడంతో ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మరోసారి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ .. స్వల్పంగా పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి.. బ్యారేజ్ వద్ద 12 అడుగులకు చేరిన వరద నీటిమట్టం

* అనంతపురం : తాడిపత్రి లో పురాతన ఆలయమైన శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవస్థానంలో నేటి నుంచి ప్రారంభం కానున్న వార్షిక బ్రహ్మోత్సవాలు.

* శ్రీ సత్యసాయి : లేపాక్షిలో దుర్గా,పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయంలో శ్రీ దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీ దుర్గా మాత

* తూర్పుగోదావరి జిల్లా: ఆంధ్ర మైసూర్ గా పేరుగాంచిన రాజమండ్రి దేవిచౌక్ లో 9వ రోజు వైభవంగా దుర్గాష్టమి వేడుకలు.. దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు

* కర్నూలు: నేడు కోడుమూరులో శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్న శ్రీ వల్లెలాంబదేవి

* నంద్యాల: బనగానపల్లె (మం) నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ క్షేత్రంలో దేవి శరన్నవ రాత్రి వేడుకల్లో నేడు దుర్గాష్టమి.. మహా దుర్గ అలంకారం లో భక్తులకు దర్శనం ఇవ్వనున్న అమ్మవారు.

* నంద్యాల: నేడు శ్రీశైలంలో 9వరోజు దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు.. సాయంత్రం సిద్ధిదాయిని అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనం.. కైలాసవాహనంపై పూజలందుకోనున్న ఆది దంపతులు.. రాత్రి క్షేత్ర పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవారి గ్రామోత్సవం

* శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు.. జలాశయం 10 గేట్లు 26 అడుగులు ఎత్తివేత.. ఇన్ ఫ్లో 5,34,281 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 6,42,626 క్యూసెక్కు క్యూసెక్కులు.. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు, ప్రస్తుతం నీటిమట్టం 883.30 అడుగులు.. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

* ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6,41,247 క్యూసెక్కులు.. కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక.. కృష్ణా, గోదావరి లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి, అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన

* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవస్థానం నందు ఘనంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. ఉత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజు అయిన నేడు వీరలక్ష్మి అలంకారం లో భక్తులకు దర్శనం ఇవ్వనున్న అమ్మవారు

* భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం 48 అడుగులు.. 11,44,646 క్యూసెక్కుల ప్రవాహం.. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ.. భద్రాచలం – చర్ల, భద్రాచలం – కూనవరం రోడ్డుపై వరద నీరు రావడంతో రాకపోకలకు అంతరాయం .. దుమ్ముగూడెం మండలం తూరుపాక వద్ద రోడ్డుపైకి వరద నీరు రావడంతో రాకపోకలని నిలిపివేసిన పోలీసులు, పర్ణశాల వద్ద నా మునిగిన సీతమ్మ నార చీరల ప్రాంతం

* ఇవాళ హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న సజ్జనార్..

Exit mobile version