Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

నేడు ఖమ్మంలో వైఎస్‌ఆర్‌టీపీ నేత వైఎస్ విజయమ్మ పర్యటించనున్నారు. ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో వైఎస్‌ఆర్‌టీపీ నియోజకవర్గాల బూత్ కమిటీల నియామకం కార్యక్రమంలో పాల్గొంటారు. రిటైర్డ్ రిటర్నింగ్ అధికారులతో ట్రైనింగ్ కార్యకర్తలతో సమావేశంకానున్నారు.

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా నేడు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో పలు చోట్ల నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా చేపట్టనున్న కార్యక్రమాలపై నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో నేతల సమావేశం కానున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులోని చంద్రబాబు రిమాండ్ 51వ రోజుకు చేరింది.

గ్రహణం అనంతరం స్దానిక ఆలయాలు తెరుచుకున్నాయి. కాణిపాకం, పద్మావతి అమ్మవారి ఆలయాన్ని అర్చకులు తెరిచి శుద్ది చేశారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించిచారు. గ్రహణం తర్వాత శ్రీవారి ఆలయం తలుపులు తెరిచి శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి యథావిధిగా దర్శనాలు కొనసాగిస్తున్నారు.

నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. కోదాడ, తిరుమలగిరి, ఆలేరులో సీఎం ప్రచారం చేయనున్నారు. ఎన్నికల నేపథ్యంలో నేడు మూడు సభల్లో సీఎం మాట్లాడనున్నారు.

నేడు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సంగారెడ్డి, మెదక్ నియోజకవర్గాల్లో కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొననున్నారు. సంగారెడ్డి గంజి మైదానంలో మద్యాహ్నం 12 గంటలకు 30 వేల మందితో బహిరంగ సభ ఉంది. మెదక్ లోని రాందాస్ చౌరస్తాలో మద్యాహ్నం 3.30 గంటలకు కార్నర్ మీటింగ్ ఉంది.

Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు భారీ షాక్.. తులంపై ఎంత పెరిగిందంటే?

నేడు మెదక్ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. నర్సాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల ముఖ్య సమావేశంలో హరీష్ రావు పాల్గొననున్నారు.

సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో ఎదురు లేకుండా సాగిపోతున్న భారత్ సెమీస్‌ బెర్తుపై గురి పెట్టింది. టోర్నీలో ఒక్క ఓటమీ లేకుండా సాగిపోతున్న టీమిండియా.. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగే పోరులోనూ ఆ రికార్డును నిలబెట్టుకుంటే నాకౌట్‌లో అడుగు పెడుతుంది. టోర్నీలో పేలవ ప్రదర్శనతో షాక్‌ల మీద షాక్‌లు తిన్న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ ఏ మేరకు పోటీ ఇస్తుందో చూడాలి. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.

 

Exit mobile version