NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

నేడు సీపీఎం నేత బృందా కారాట్‌ ఆదిలాబాద్ నగరంలో పర్యటించనున్నారు. సీఐటీయూ కార్యాలయ ప్రారంభంతో పాటు సభలో పాల్గొననున్నారు. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బహిరంగ సభలో మాట్లాడనున్నారు.

నేడు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ బెయిల్‌ పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఆర్జీవీ నాలుగు రోజులుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. వర్మ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది.

మహారాష్ట్ర సీఎం ఎవరన్నది బీజేపీ హైకమాండ్‌ నేడు తేల్చబోతోంది. ఏక్‌నాథ్ షిండే రేసు నుంచి తప్పుకోవడంతో.. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు రూట్‌ క్లియరయ్యింది. ప్రధాని మోడీ, బీజేపీ అగ్రనేత అమిత్‌షా తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు షిండే. సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండే అవకాశం ఉంది.

జార్ఖండ్‌ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్‌ సోరెన్‌ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాంచీలోని మొరాబాది స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్‌కు చెందిన జార్ఖండ్‌ ముక్తిమోర్చా ఆధ్వర్యంలోని ఇండియా కూటమి గ్రాండ్ విక్టరీ సాధించింది. 81 మంది సభ్యులుండే అసెంబ్లీలో జేఎంఎం కూటమి 56, ఎన్‌డీఏ 24 సీట్లు దక్కించుకున్నాయి.

నేటి నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఆనం పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు డిసెంబర్ 6 వరకు జరగనున్నాయి.

నేడు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా పార్లమెంటులో ఎంపీగా ప్రమాణం చేయనున్నారు. తొలిసారి ఎంపీగా ప్రమాణం చేయనున్న ప్రియాంక.. మొదటిసారి పార్లమెంటులో అడుగుపెట్టనుండటం గమనార్హం. వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఆమె ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.