NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

నేడు కూడా ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి.. నేడు వరంగల్ లో జరగాల్సిన కాంగ్రెస్ సభ రేపటికి వాయిదా.. నేడు ఢిల్లీలో మరోసారి కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం.. కేబినెట్ విస్తరణ, టీపీసీసీ చీఫ్ ఎంపికపై చర్చ.. పార్టీలో కొత్తగా చేరిన వారికి మంత్రి పదవులు ఇవ్వొద్దని చర్చ..
నేడు పదవతరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు.. నేడు మధ్యాహ్నం 3 గంటలకు వెబ్ సైట్ లో ఫలితాలు..
నేటి నుంచి రెండు రోజులు పాటు కాకినాడ జిల్లాలో పర్యటించనున్న సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్.. అధికారులతో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం.. క్షేత్రస్థాయిలో పర్యటించనున్న మంత్రి..
నేటి నుంచి ఖమ్మంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు.. హాజరు కానున్న కే నారాయణ, ఎమ్మెల్యే సాంబశివ రావు..
నేడు జేటీసీ రమేష్ పై దాడికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు.. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు.. మౌనం పాటిస్తూ పెన్ డౌన్ చేయాలని నిర్ణయం.. నిరసన కార్యక్రమాలకు మద్దతు పలికిన టీజీవో, టీఎన్జీవో, తెలంగాణ గ్రూప్-1 ఆఫీసర్స్ అసోసియేషన్, తెలంగాణ మోటార్ ట్రన్స్పోర్ట్ టెక్నీకల్ ఆఫీసర్స్ అసోసియేషన్..
నేడు విశాఖపట్నంలోని జీవీఎంసీ ధర్నా చౌక్ దగ్గర పీఓడ్ల్యూ నిరవధిక నిరసన దీక్ష.. కేంద్ర, రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ రద్దు ప్రకటన చేయాలని డిమాండ్..
నేడు అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ముందు ఆందోళన..
నేటి నుంచి మండపేట – ద్వారపూడి రోడ్డులో రాకపోకలు బంద్..
వేగవంతం కానున్న రోడ్డు నిర్మాణ పనులు.. మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..
నేటి ఉదయం 11:00 గంటలకు రాజమండ్రి క్వారీ మార్కెట్ దగ్గర గల బీజేపీ కార్యాలయంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు ప్రెస్ మీట్..
నేడు భారత్ చేరనున్న గోపికృష్ణ మృతదేహం.. అమెరికాలో దుండగుడి కాల్పుల్లో మృతి చెందిన దాసరి గోపి కృష్ణ.. బాపట్ల మండలం యాజలిలో గోపి అంత్యక్రియలు..
నేడు పార్లమెంట్ సమావేశాల్లో నీట్ పై నోటీస్.. ఇండియా కూటమి కీలక నిర్ణయం.. ప్రజాస్వామ్య సమస్యలపై పోరాటం చేస్తామని వెల్లడి