NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

*9హైదరాబాద్: నేటి నుంచి ఇంటి వద్దకే టీజీఎస్‌ఆర్టీసీ కార్గో సేవలు.. హైదరాబాద్‌లో పైలట్‌ ప్రాజెక్ట్‌గా పార్సిళ్ల హోం డెలివరీ.. త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా హోం డెలివరీ సేవలు.

*నేటి నుంచి విజయవాడ-విశాఖ మధ్య మరో ఇండిగో విమాన సర్వీసు.. సా.7.15 గంటలకు బయల్దేరి రాత్రి 8.20 గంటలకు విశాఖ చేరుకోనున్న ఫ్లైట్.. తిరిగి 8.45 గంటలకు బయల్దేరి రాత్రి 9.50 గంటలకు విజయవాడకు రానున్న విమానం.

*విజయవాడ-విశాఖ మధ్య విస్తరిస్తున్న ఎయిర్ కనెక్టివిటీ.. నేడు రెండు సర్వీసులను ప్రారంభించనున్న ఎయిరిండియా, ఇండిగో.. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ప్రారంభించనున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.

*తమిళనాడు: నేడు తమిళ హీరో విజయ్ పార్టీ టీవీకే మహానాడు.. టీవీకే మొదటి మహానాడు కావడంతో విళుపురం జిల్లా విక్రవాండిలో భారీగా ఏర్పాట్లు.. సాయంత్రం 5 గంటల నుంచి టీవీకే మహానాడు నిర్వహణ.. తిరుచ్చి జాతీయ రహదారిలో సుమారు 3 కిలోమీటర్ల మేర జెండాలు, విద్యుత్ దీపాలంకరణ.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్న హీరో విజయ్.

*ఏలూరు: నేడు మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లులో పర్యటన.. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయనున్న మంత్రి నిమ్మల.

*నేడు ఖమ్మం, మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన.

*కాకినాడ: నేడు రత్నగిరిపై కార్తీకమాసం ఏర్పాట్లపై సమీక్ష.. ప్రజాప్రతినిధులు, అధికారులతో జరగనున్న ట్రస్ట్‌బోర్డ్‌ సమావేశం.. కార్తీకమాసంలో సత్యదేవుడిని 12 లక్షల మంది భక్తులు దర్శించుకుంటారని అంచనా.. రత్నగిరి సత్యదేవుడి ఆలయంలో సౌకర్యాల ఏర్పాట్లపై చర్చ.

*తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,600.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.80,290.. కిలో వెండి ధర రూ.1,07,000.