నేడు మెదక్ జిల్లాలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొననున్నారు.
నేడు సంగారెడ్డి జిల్లా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఆందోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలకు రాహుల్ హాజరుకానున్నారు.
నేడు సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొననున్నారు.
నేడు సంగారెడ్డి జిల్లాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సాయంత్రం పటాన్ చెరులో ఎన్నికల బహిరంగ సభకు రేవంత్ హాజరుకానున్నారు.
నేడు మెదక్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన ఉంది. నర్సాపూర్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డికి మద్దతుగా రోడ్ షోలో కేటీఆర్ పాల్గొననున్నారు.
శ్రీవారి దర్శనం కోసం ప్రధాని నరేంద్ర మోడీ నేడు తిరుమలకు వస్తున్నారు. రాత్రి 7:50కి ప్రధాని తిరుమల చేరుకోనున్నారు. తిరుపతి విమానాశ్రమంలో ప్రధానికి సీఎం జగన్ స్వాగతం పలకనున్నారు. రేపు ఉదయం స్వామివారిని మోడీ దర్శించుకోనున్నారు.
నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా, సీఎం బుపేష్ భగెల్ పర్యటించనున్నారు. ములుగు నియోజకవర్గంలో అమిత్ షా పర్యటించనున్నారు.