అమరావతి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు జరగనున్నాయి. ఉదయం 8.45 గంటలకు రిపబ్లిక్ డే పెరేడ్ ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ జెండా ఆవిష్కరణ చేయనున్నారు. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఉదయం 9 గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరగనుండగా.. వైసీపీ ముఖ్య నేతలు హాజరుకానున్నారు.
విజయవాడలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొనున్నారు.
నేడు మంగళగిరిలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించనున్నారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం, చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు.
నేడు కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కోస్గి మండలం చంద్రవంచలో ప్రభుత్వ పథకాలను సీఎం ప్రారంభించనున్నారు.
నేడు కరీంనగర్ జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించనున్నారు. మానకొండూర్ నియోజకవర్గ పరిధిలోని ముంజంపల్లిలో గ్రామ సభలో మంత్రి పాల్గొననున్నారు.
నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటించనున్నారు. ఇసోజీపేట గ్రామంలో 4 కొత్త పథకాలను మంత్రి ప్రారంభించనున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భారీగా భక్తులు తరలివస్తున్నారు.
దేశ సాంస్కృతిక వారసత్వ వైభవాన్ని, సైనిక శక్తి సామర్థ్యాలను చాటేలా 76వ గణతంత్ర దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించనుంది.
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నేడు రసవత్తర టైటిల్ పోరుకు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ యానిక్ సినర్ (ఇటలీ) జరిగే ఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)ను ఢీకొంటాడు.