NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

ఈరోజు ఉదయం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ రానున్నారు. ఏపీ మంత్రి టీజీ భరత్ కూతురి వివాహానికి హాజరుకానున్నారు.

నేడు పులివెందులలోని వైసీపీ క్యాంప్ ఆఫీసులో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. రేపు బెంగళూరులో ఓ వివాహానికి హాజరుకానున్నారు.

ఈరోజు ప్రకాశం జిల్లాలో ఏపీ విపత్తుల శాఖ పర్యటించనుంది. ముండ్లమూరు, తాళ్లూరు మండళ్లాల్లో వరుస భూప్రకంపనలపై అధ్యయనం చేయనున్నారు.

నేడు వంగవీటి మోహనరంగా వర్ధంతి వేడుకలు జరగనున్నాయి. పలు ప్రాంతాల్లో వంగవీటి రాధాకృష్ణ విగ్రహ ఆవిష్కరణలు చేయనున్నారు.

నేడు సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖుల సమావేశం కానున్నారు. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ భేటీ జరగనుంది. సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులు సీఎంను కలవనున్నారు.

కర్ణాటకలోని బెలగావిలో నేడు, రేపు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి నవ సత్యాగ్రహ భైఠక్‌గా నామకరణం చేశారు. ఈ భేటీకి సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వనితులు, ప్రత్యేక ఆహ్వనితులు, పీసీసీలు, సీఎల్పీ నేతలతో పాటు పార్లమెంటరీ పార్టీ ఆఫీస్‌ బేరర్లు, మాజీ ముఖ్యమంత్రులు సైతం హాజరుకానున్నారు.

ఆస్ట్రేలియా, భారత్‌ జట్ల మధ్య బాక్సింగ్‌ డే టెస్టు మెల్‌బోర్న్ వేదికగా నేడు ఆరంభం అయింది. నాలుగో టెస్టులో ఆసీస్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి సెషన్‌లో ఆస్ట్రేలియా స్కోరు 112/1.