* నేడే రథసప్తమి.. రథసప్తమి సందర్భంగా అరసవిల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు.. క్యూ లైన్లలో గంటల కొద్దీ వేచి ఉన్న భక్తులు.. ఆదివారం రథసప్తమి కావడంతో లక్షలాదిగా దర్శనలకు వచ్చిన బక్తులు.. జనంతో నిండిపోయిన అరసవెల్లి రోడ్లు..
* నేడు తిరుచానూరు సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు.. అశ్వ వాహనంపై తిరుమాఢ విధుల్లో విహరిస్తున్న సూర్యనారాయణ స్వామి..
* నేడు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన రథసప్తమి వేడుకలు.. సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తున్న మలయప్పస్వామి..
* నేడు కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి.. పండగ సందర్భంగా సూర్య నమస్కారాలు, అనంతరం శ్రీ స్వామివారి సూర్యప్రభ వాహన సేవా..
* నేడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి పాదాలు చెంత పూజ చేసిన పెన్నలు పంపిణీ.. పెన్నుల పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు.. సుమారు రెండు లక్షల పెన్నులను విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనున్న ఆలయ అధికారులు..
* నేడు శ్రీశైలం మల్లన్న ఆలయంలో మాఘ శుద్ధ సప్తమి సందర్భంగా రథసప్తమి వేడుకలు.. ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో సూర్యా రాధన.. వైదికాచార్యులు బీజమంత్రాలు, ప్రత్యేక ముద్రలతోనూ సూర్యా నమస్కారాలు.. సూర్య భగవానుడికి ఉత్తరపూజనము, నివేదన, మంత్రపుష్పం..
* నేడు సీఎం చంద్రబాబుతో టీడీపీ ఎంపీల సమావేశం.. కేంద్ర బడ్జెట్, పార్లమెంట్ సమావేశాలపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం..
* నేడు మహారాష్ట్ర నాందేడ్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన.. గురుద్వారాలో సిక్కు దస్తార్ (టర్బన్) ధారణ చేయనున్న పవన్.. దర్బార్ సాహిబ్‌లో ప్రత్యేక ప్రార్థనలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొననున్న డిప్యూటీ సీఎం పవన్..
* నేడు కాకినాడ జిల్లాలోని సామర్లకోటలో రాష్ట్రస్థాయి ఎద్దుల పరుగు ప్రదర్శన అందాల పోటీలు.. పాల్గొననున్న 44 జతల ఎద్దులు.. నగదు బహుమతులు ప్రకటించిన నిర్వాహకులు..
* నేడు భారత్- న్యూజిలాండ్ మధ్య మూడో టీ20.. గౌహాతి వేదికగా రాత్రి 7 గంటలకి మ్యాచ్..
