Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

What's Today Ntv

What's Today Ntv

* ఢిల్లీ: ఇవాళ ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో కీలక సమావేశం.. రాష్ట్రాల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపికకు నియమించిన ఏఐసీసీ పరిశీలకుల సమావేశం

* ఇవాళ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన.. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తర వర్షాలు.. రానున్న మూడు రోజులు వర్షాలు పడే అవకాశం

* తిరుమల: 4 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 72,119 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 25,294 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.02 కోట్లు

* హైదరాబాద్‌: ఉదయం 11 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీలో కొత్తగా నిర్మించిన హాస్టళ్ల ప్రారంభోత్సవం.. వివిధ భవన నిర్మాణాలకు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి.

* ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి.. న్యాయ నిపుణులతో భేటీ అయ్యే అవకాశం.. రేపు ఢిల్లీ నుండి బీహార్ లో రాహుల్ గాంధీ పాదయాత్రకి సీఎం రేవంత్.. మంత్రులు

* నేడు ఢిల్లీకి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.. అభిషేక్‌ మనుసింఘ్వీ, జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డితో భేటీ

* అమరావతి: ఏపీలో నేడు స్మార్ట్ రైస్ కార్డు ప్రారంభోత్సవం.. ఉదయం 10:30కు వరలక్ష్మీనగర్, విజయవాడ ఈస్ట్, ఎన్టీఆర్ జిల్లా, మధ్యాహ్నం 12:00 గంటలకు కంకిపాడు, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణా జిల్లాలో ఇంటింటికి స్మార్ట్ రైస్ కార్డుల కార్యక్రమాన్ని ప్రారంభించనున్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్

* నాలుగు విడతల్లో 1 కోటి 45 లక్షల మందికి రేషన్ కార్డుల పంపిణీ.. మొదటి విడత నేటి నుంచి 9 జిల్లాలు విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, ఈస్ట్ & వెస్ట్ గోదావరి, కృష్ణా, రెండో విడత ఈ నెల 30 నుంచి 4 జిల్లాలు చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు..మూడో విడత వచ్చే నెల 6 నుంచి 5 జిల్లాలు అనంతపురం, అల్లూరి సీతారామ రాజు, పార్వతీపురం మన్యం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి.. నాలుగో విడత వచ్చే నెల 15 నుంచి 8 జిల్లాలు – బాపట్ల, పలనాడు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, శ్రీ సత్య సాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం

* అమరావతి: ఇవాళ జరగాల్సిన డీఎస్సీ వెరిఫికేషన్ రేపటి నుంచి జరుపుతున్నట్టు ప్రకటన. ముందుగా ప్రకటించినట్లు ఇవాళ ఉండదని, అన్ని జిల్లాల్లో వాయిదా వేసినట్లు డీఎస్సీ కన్వీనర్ కృష్ణారెడ్డి ప్రకటన.. రేపటి నుంచి డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్.

* అమరావతి: ఇవాళ ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ నుంచి అమరావతి కి సీఎం చంద్రబాబు. విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఏపీ సచివాలయానికి సీఎం చంద్రబాబు.. కొన్ని కీలక శాఖలకు సంబంధించి సమీక్ష

* ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి మాజీ సీఎం వైఎస్ జగన్.. ఉదయం 9.10 గంటలకు బెంగుళూరులోని తన నివాసం నుంచి ఎయిర్ పోర్టుకు బయలుదేరి 9.30 గంటలకు చేరుకోనున్న జగన్.. ఉదయం 10.15 గంటలకు విమానంలో బయలుదేరి 11.55 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్.. మధ్యాహ్నం 12.10 అక్కడి నుంచి బయలుదేరి 12.40 గంటలకు తాడేపల్లి లోని తన నివాసానికి చేరుకుంటారు జగన్.. అనంతరం అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో సమావేశం అయ్యే అవకాశం..

* ప్రకాశం : ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా జనసేన నేత షేక్ రియాజ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం, హాజరుకున్న మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాలవీరంజనేయస్వామి, పలువురు ఎమ్మెల్యేలు..

* ప్రకాశం : మార్కాపురం ఏఎంసీ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం.. ముఖ్య అతిథులుగా హాజరుకానున్న మంత్రులు అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణరెడ్డి, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన్ రెడ్డి, డోల బాల వీరాంజనేయులు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు, ఇన్చార్జులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్ లు..

* ప్రకాశం : ఒంగోలులో సీపీఐ రాష్ట్ర మహాసభలు, హాజరుకానున్న ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ, ఇతర ముఖ్య నేతలు..

* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి మూలాఖత్ కానున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి , జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ , ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి జయ ప్రకాష్

* తూర్పుగోదావరి జిల్లా: నేటి నుండి జిల్లాలో డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీ.. నిడదవోలులో డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్.. నిడదవోలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీకి ఏర్పాట్లు

Exit mobile version