ఇవాళ ఆన్‌లైన్‌లో రూ.300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదులు కోటాను టీటీడీ విడుదల చేస్తుంది.
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
నేటి నుంచి ఏబీవీపీ 43వ రాష్ట్ర మహసభలు జరగనున్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న సభలకు 2500 మంది ప్రతినిధులు తరలిరానున్నారు.
ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీసులో వర్క్ షాప్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ అధికార ప్రతినిధులకు కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధిష్టానం వర్క్ షాప్ నిర్వహించనుంది.
ఇవాళ ఉదయం 9 గంటలకు రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటించనున్నారు. నేలపాడు ప్రాంతంలో జరుగుతున్న రాజధాని పనులు మంత్రి పరిశీలించనున్నారు.
టీడీపీ నేత పరిటాల రవీంద్ర 20 వర్ధంతి సందర్భంగా రామగిరి మండలం వెంకటాపురంలోని పరిటాల రవీంద్ర ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులర్పించనున్నారు.
నేడు ఢిల్లీలో కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్‌తో సీఎం సమావేశం అవుతారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను చంద్రబాబు కలనునారు.
నేడు బీఆర్కే భవన్‌లో కాళేశ్వరం కమిషన్ నాలుగో రోజు బహిరంగ విచారణ జరగనుంది. ఈరోజు కాళేశ్వరం కమీషన్ ముందుకు మెడిగడ్డ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధులు హాజరుకానున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో రోజు గ్రామ సభలు కొనసాగనున్నాయి. నేటి వరకు 13,861 (85 శాతం) గ్రామ సభలు పూర్తయ్యాయి.
నేడు కరీంనగర్ జిల్లాలో కేంద్రమంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, బండి సంజయ్.. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగిసింది. ఈరోజు ఉదయం 8.30 గంటలకు సీఎం హైదరాబాద్ చేరుకుంటారు.
నేడు రామానాయుడు స్టూడియోలో ముని దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ కొత్త సినిమా లాంచ్ కానుంది.
ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్ నేడు జరగనున్నాయి. తొలి సెమీస్‌లో ఏడో సీడ్ జకోవిచ్ (సెర్బియా) రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)ని ఢీకొటుండగా.. రెండో సెమీస్‌లో టాప్‌సీడ్ సినర్ (ఇటలీ) అమెరికా సంచలనం బెన్ షెల్టన్‌తో తలపడనున్నాడు.