Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

నేడు సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 5.30 గంటలకి గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకోనున్నారు. ఇవాళ రాత్రికి ఢిల్లీలోనే సీఎం ఉండనున్నారు.

నేడు దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. ఎంపీ కేశినేని చిన్ని తుమ్మలపల్లి కలా క్షేత్రంలో విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు.

విజయవాడ దుర్గమ్మ భవానీ దీక్షల విరమణ నేటితో నాలుగో రోజుకు చేరుకుంది. రేపటితో భవానీ దీక్షలు ముగియనున్నాయి.

నేడు మాజీ మంత్రి పేర్ని నాని క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరపనుంది. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో విచారణకు రావాలని ఇచ్చిన నోటీసు సవాలు చేస్తూ పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టు పిటిషన్లు వేశారు.

నేడు కడప జిల్లాకు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రానున్నారు. నాలుగు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి కడపకు జగన్ చేరుకోనున్నారు.

సంధ్య థియేటర్‌ ఘటనలో నేడు అల్లు అర్జున్ పోలీసుల విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని చిక్కడపల్లి పోలీసులు నోటీసులు పంపారు. నిన్న అర్ధరాత్రి వరకూ లీగల్ టీమ్‌తో అల్లు అర్జున్‌ భేటీ అయి.. పోలీసుల నోటీసులపై చర్చించారు.

కేరళ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నేడు తిరువనంతపురం నుంచి హైదరాబాద్ రానున్నారు. ఉదయం 11 గంటలకు సీఎం హైదరాబాద్ చేరుకోనున్నారు.

నేడు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావులు పర్యటించనున్నారు.

నేడు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సునీల్ బన్సల్ భేటీ కానున్నారు. బూత్, మండల కమిటీ అధ్యక్షుల ఎన్నికలపై చర్చించనున్నారు. అలానే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలపై చర్చించానున్నారు.

నేటి నుంచి ఆరు రోజుల పాటు అమెరికాలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత భారత్ నుంచి అమెరికాకు వెళ్లడం ఇదే మొదటిసారి. అమెరికా పర్యటనలో జైశంకర్ ప్రధానంగా ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చలు కొనసాగించే అవకాశం ఉంది.

ఈరోజు విండీస్‌తో భారత్‌ రెండో వన్డేలో తలపడనుంది. వదోదరలో మధ్యాహ్నం 1.30 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటికే టీ20లను కైవసం చేసుకున్న హర్మన్‌ప్రీత్‌ సేన.. వన్డే సిరీస్‌నూ మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే నెగ్గాలనే లక్ష్యంతో ఉంది.

Exit mobile version