నేడు విజయ డైరీ పాలకవర్గ సమావేశం నంద్యాలలో జరగనుంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల, విజయ డైరీ చైర్మన్ ఎస్వీ జగన్ మోహన్ రెడ్డి మధ్య వివాదం నేపథ్యంలో పోలీస్ బందోబస్తు మధ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పోలీస్ భద్రత కల్పించాలని చైర్మన్ ఎస్వీ జగన్, మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డిలు గురువారం నంద్యాల ఎస్పీని కోరారు.
శుక్రవారం సందర్భంగా శ్రీశైలంలో శ్రీభ్రమరాంబికాదేవి ఆలయ ప్రాంగణంలో శ్రీస్వామి అమ్మవారి ఊయలసేవ, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
నేడు పెనమలూరులో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ధాన్యం కొనుగోలు సెంటర్ పరిశీలించి.. రైతులతో మాట్లాడతారు. అనంతరం రెవెన్యూ సదస్సులో సీఎం పాల్గొననున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు సాలూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సాలూరు నుంచి బయలుదేరి మక్కువ మండలం బాగుజోల గ్రామంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారు. బాగుజోల వద్ద రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం.. అక్కడ గిరిజనులతో పవన్ ముఖాముఖి మాట్లాడనున్నారు.
నేడు విశాఖలో పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ పర్యటించనున్నారు. పరవస్తు చిన్నయ్య సూరి జయంతి వేడుకలకు మంత్రి హాజరుకానున్నారు.
మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ ముందస్తు బెయిల్‌పై నేడు జిల్లా కోర్టు విచారణ చేయనుంది. గోదాముల్లో రేషన్ బియ్యం మాయంపై జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నేడు తెలంగాణ అసెంబ్లీలో ఆరవ రోజు సమావేశాలు కొనసాగనున్నాయి. నేడు సభలో ప్రశ్నోత్తరాలు రద్దయ్యాయి. మొదట భూ భారతి బిల్లుపై చర్చ జరగనుండగా.. స్వల్పకాలిక చర్చలో రైతు భరోసాపై చర్చ జరగనుంది.
నేడు సంగారెడ్డి జైలు నుండి లగచర్ల కేసు నిందితులు బెయిల్‌పై విడుదల కానున్నారు. రెండ్రోజుల క్రితం 17 మందికి నాంపల్లి స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిన్న విడుదల కావాల్సి ఉన్నా.. సరైన సమయంలో బెయిల్ పత్రాలు అందలేదు.
నేటి నుంచి ఖమ్మం జిల్లా ఇల్లందులో సీపీఎం మూడో మహాసభలు జరగనున్నాయి. తమ్మినేని వీరభద్రం ఈ మహాసభలో పాల్గొననున్నారు.
నేడు దేశవ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కారణంగా కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చింది.