NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

*తిరుమల: నేటి నుంచి పుష్కరిణిలోకి భక్తులను అనుమతించనున్న టీటీడీ.. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నెల రోజుల పాటు పుష్కరిణికి మరమ్మతులు.. నేటి నుంచి పుష్కరిణి హారతి పునరుద్ధరణ.

*కడప: నేడు పులివెందులలో వైఎస్‌ జగన్ ప్రజాదర్బార్.. తన కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్న జగన్.

*తీరం దాటిన వాయుగుండం.. బంగాళాఖాతంలో అర్ధరాత్రి 12.30-2.30 గంటల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటిన వాయుగుండం.. వాయవ్యంగా పయనిస్తున్న వాయుగుండం.. ఉత్తరాంధ్ర మీద ఆవరించి బలహీన పడనున్న వాయుగుండం.. కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం.. తెలంగాణలోనూ అనేక చోట్ల భారీ వర్షాలు.

*నెల్లూరు జిల్లా: ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్ట్‌లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ.. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో పలు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ.. కృష్ణపట్నం పోర్టులో ముందస్తు జాగ్రత్తను సూచించే మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక.

*మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో కురుస్తున్న అతి భారీ వర్షాలు.. సంగారెడ్డి, మెదక్ కలెక్టరేట్‌లలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన అధికారులు.. మెదక్ జిల్లా కంట్రోల్ రూమ్ నెంబర్ 9391942254.. సంగారెడ్డి జిల్లా కంట్రోల్ రూం నెంబర్ 08455- 276155.. వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్‌లలో 24 గంటల పాటు పనిచేయనున్న ఫోన్ నెంబర్లు.. జిల్లాలో అధికారులంతా అలెర్ట్‌గా ఉండాలని సంగారెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ల ఆదేశాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిక.

*ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు.. ప్రస్తుతం 23 అడుగులు దాటిన రిజర్వాయర్.. పాలేరు రిజర్వాయర్ నుండి రోడ్డుపై 2 అడుగులు పొంగిపొర్లుతున్న అలుగు.. పాలేరు-నాయకన్ గూడెం మధ్య రహదారి బంద్‌ చేసిన అధికారులు.. పాలేరు నుండి నర్సింలగూడెం వెళ్లే దారిలో వాగు వస్తుండటంతో అటువైపు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసిన అధికారులు

*ఖమ్మం: నేడు మధిర నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో వర్షాలపై అధికారులతో సమీక్ష.

*అల్లూరి: చింతూరు-మారేడుమిల్లి ఘాట్‌ రోడ్డు మూసివేత.. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో మారేడుమిల్లి ఘాట్‌ రోడ్డులోకి వాహన రాకపోకలు నిషేధం.. రాజమండ్రి నుంచి చింతూరు వైపు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచన.. భారీ వర్షాలతో చింతూరు ఏజెన్సీలో పర్యాటక ప్రాంతాలు మూసివేత.. పొల్లూరు జలపాతం, సోకిలేరు వ్యూపాయింట్, పుష్ప బ్రిడ్జ్ స్పాట్ సహా అన్ని పర్యాటక ప్రాంతాలు మూసివేత.

*ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.. 70 గేట్లను పూర్తిగా ఎత్తివేసిన అధికారులు.. సముద్రంలోకి 4,06,490 క్యూసెక్కుల నీరు విడుదల.. ప్రకాశం బ్యారేజీ నుంచి కాల్వలకు 500 క్యూసెక్కుల నీరు విడుదల.. ప్రకాశం బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 4,06,990 క్యూసెక్కులు.. ప్రకాశం బ్యారేజీ నీటిమట్టం 12.2 అడుగులు.

 

*బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్న టాలీవుడ్.