నేడు విజయనగరం, విశాఖ జిల్లాల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటించనున్నారు.
ఈరోజు నెల్లూరులో టీడీపీ నేతలు, కార్యకర్తలతో మంత్రి నారాయణ సమావేశం కానున్నారు.
ఒంగోలులో మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సహా పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.
తుఫాన్ ప్రభావంతో ఏపీ, తమిళనాడులోని పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. మరో 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరించారు. పుదుచ్చేరి సమీపంలో ఫెంజల్ తుఫాన్ తీరం దాటింది. మహాబలిపురం-కరైకల్ మధ్య తుఫాన్ తీరం దాటింది. పశ్చిమ-నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ బలహీనపడనుంది.
విజయవాడలో జరుగుతున్న బిజినెస్ ఎక్స్ పో నేటితో ముగియనుంది. మూడు రోజులుగా జరుగుతున్న ఎక్స్ పోకు నేడు చివరి రోజు.
కాంగ్రెస్ ఏడాది పాలనపై నేటి నుంచి బీజేపీ పొరుబాట పట్టనుంది. 6 అబద్దాలు-66 మోసాలు అనే నినాదంతో నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి.
ఆస్ట్రేలియా, భారత్ డే/నైట్ టెస్టు ముందు గులాబీ బంతి వార్మప్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. ఆస్ట్రేలియా పీఎం ఎలెవన్, భారత్ మధ్య రెండు రోజుల మ్యాచ్‌లో ఒక రోజు వర్షార్పణం అయిపోయింది. ఆదివారం ఇరు జట్లు 50 ఓవర్ల చొప్పున మ్యాచ్ ఆడేందుకు అంగీకరించాయి. అయితే వర్షం అవకాశమిస్తుందా? అన్నది సందేహం.
ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో నేడు తమిళ్ తలైవాస్, దబంగ్ ఢిల్లీ మధ్య రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. బెంగాల్ వారియర్స్, పట్నా పైరేట్స్ మ్యాచ్ 9 గంటలకు మొదలవుతుంది.