NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today New

Whats Today New

* టీ20 వరల్డ్‌కప్‌: నేడు దక్షిణాఫ్రికాతో అమెరికా ఢీ.. రాత్రి 8 గంటలలకు సూపర్‌ 8 మ్యాచ్‌ ప్రారంభం

* ఢిల్లీ: నేడు సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం. పలు కీలక అంశాలపై చర్చ. మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండో సారి కేబినెట్‌ భేటీ

* అమరావతి: నేడు ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న పవన్‌ కల్యాణ్‌

* హైదరాబాద్‌: నేడు ఉదయం 10 గంటలకు తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం.. రాష్ట్రంలో నిర్మిస్తున్న జాతీయ రహదారులు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రోడ్లు, సీఆర్ఐఎఫ్ రోడ్లు, రూరల్ రోడ్స్, మెడికల్ బిల్డింగ్స్, రాష్ట్ర రహదారులు, ఆర్ఓబీ/ఆర్యూబీల నిర్మాణాలతో పాటు బ్లాక్ స్పాట్ల రిపేర్లకు సంబంధించి వివిధ దశల్లో కొనసాగుతున్న పనుల పురోగతి, వాటి స్థితిగతులపై ఉన్నతాధికారులతో విభాగాల వారీగా సమీక్ష సమావేశం

* నేడు మెదక్ జిల్లాలో మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ పర్యటన.. నర్సాపూర్ నియోజకవర్గంలో బడిబాట కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రులు.. అనంతరం కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ చేయనున్న మంత్రులు

* నేడు ఖమ్మంలో tuwj iju మూడో మహాసభలను ప్రారంభించనున్న సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి

* తిరుమల: ఇవాళ నుంచి మూడు రోజులు పాటు శ్రీవారి వార్షిక జేష్ఠాభిషేకం ఉత్సవాలు, మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ

* తిరుపతి: మూడో రోజుకు చేరుకున్న పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు.. నేడు తెప్పలపై పద్మా సరోవరంలో విహరించనున్న పద్మావతి అమ్మవారు..

* ప్రకాశం : ఒంగోలు కలెక్టరేట్ లో అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొననున్న మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి..

* ఒంగోలులో పలు కార్యక్రమాలకు హాజరుకానున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి..

* అనంతపురం : రబీ సీజన్ లో పంట నష్టంప్తె అధ్యయనం చేసేందుకు ఇవాళ జిల్లాలో పర్యటించ నున్న కేంద్ర కరువు బృందం సభ్యులు. రొద్ధం మండలం కొట్టాల , చెరుకూరు గ్రామ పొలాలను పరిశీలించి , ర్తెతులతో మాట్లాడనున్న బృందం.

* అనంతపురం: మాజీ శాసనసభ స్పీకర్ కోడెలశివ ప్రసాద్ ఆత్మహత్యకు కారణమ్తెన మాజీ సీఎం జగన్‌పై కేసు నమోదు చేయాలంటూ ఎస్పీకి ఫిర్యాదు చేసిన తెలుగుమహిళ రాష్ట్రనాయకురాళ్లు.