NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

నేడు మాజీ సీఎం వైఎస్ జగన్ కర్నూలుకు రానున్నారు. బెంగుళూరు నుంచి ప్రత్యేక విమానంలో కర్నూలు చేరుకోనున్నారు. కర్నూలులో వైసీపీ నేత తెరనేకల్ సురేంద్ర కుమార్తె వివాహానికి జగన్ హాజరుకానున్నారు.

మాజీ మంత్రి ఆళ్ల నాని నేడు టీడీపీలో చేరనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరనున్నారు.

నేడు మంత్రి నారాయణ కాకినాడలో పర్యటించనున్నారు. జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు.

ఈరోజు విశాఖలో రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ పర్యటించనున్నారు. ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌకను ఆయన ప్రారంభించనున్నారు.

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. సమావేశం అనంతరం విజయవాడకు వెళ్లనున్నారు.

నేడు, రేపు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సీపీఎం జిల్లా మహాసభ జరగనుంది. ఈ మహాసభకు సీపీఎం నేత బీవీ రాఘవులు హాజరుకానున్నారు.

నిన్న మంగళగిరిలోని ‘ఎయిమ్స్‌’ ప్రథమ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. నేడు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులను రాష్ట్రపతి ఆరంబించనున్నారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి హైదరాబాద్‌కు వచ్చారు.

నేడు అసెంబ్లీలో ఆర్ఓఆర్ బిల్లు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్ఓఆర్-2020ని ప్రభుత్వం రద్దు చేయనుంది.

ఈరోజు ఉదయం 11 గంటలకు పీసీసీ ఆధ్వర్యంలో ‘ఛలో రాజ్ భవన్’ కార్యక్రమం జరగనుంది. ఏఐసీసీ పిలుపు మేరకు ఛలో రాజ్ భవన్ కార్యక్రమంకు పీసీసీ పిలుపునిచ్చింది.

బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా – భారత్ జట్ల మధ్య మూడో టెస్టు బ్రిస్బేన్ వేదికగా జరుగుతోంది. ఐదో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికి వర్షం మొదలైంది.

Show comments