NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today New

Whats Today New

*నేడు యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ 2024 ప్రిలిమ్స్‌ పరీక్ష.. 80 నగరాల్లో జరగనున్న పరీక్ష.. కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం.. 30 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల గేట్లు బంద్.. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పేపర్‌-1.. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 గంటల వరకు పేపర్‌-2.

*తూర్పుగోదావరి: నేడు రాజమండ్రికి ఎంపీ పురంధేశ్వరి రాక.. 3 రోజుల పాటు ప్రజలకు అందుబాటులో ఉండనున్న పురంధేశ్వరి.. జేఎన్‌ రోడ్డులోని కోస్టల్ గెస్ట్‌హౌస్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరణ.

*అమరావతి: నేడు డిప్యూటీ సీఎం పవన్ విజయవాడకు రాక.. గన్నవరం విమానాశ్రయం నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్లనున్న పవన్

*తిరుమల: ఇవాళ శ్రీవారి ఆలయంలో ప్రత్యేక సహస్ర కలషాభిషేకం.. ఏడాదికి ఒక్కసారి స్వామివారికి సహస్రకలషాభిషేకం నిర్వహించనున్న అర్చకులు

*తిరుమల: ఇవాళ టీటీడీ ఈవోగా బాధ్యతలు అప్పగించనున్న శ్యామలరావు

*తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 30 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 82,886 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 44,234 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.09 కోట్లు.

*నేడు శ్రీశైలంలో శ్రీభ్రమరాంబికాదేవి ఆలయంలో శ్రీస్వామి అమ్మవారికి పల్లకిసేవ

*ఖమ్మం: నేడు మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన.. పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు

*తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,550.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,500.. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.95,600.