* నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఉదయం 10. 30 గంటలకు సమావేశాలు ప్రారంభం.. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై సభలో ప్రకటన.. విగ్రహ మార్పుపై సభలో వివరించనున్న సీఎం రేవంత్..
* నేడు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ.. సాయంత్రం 6 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ.. విగ్రహావిష్కరణపై అసెంబ్లీ ప్రకటన చేయనున్న సీఎం రేవంత్..
* నేటి ఉదయం 9.45 గంటలకు గాంధీభవన్ కు సీఎం రేవంత్.. ఉదయం 10.25 గంటలకు అసెంబ్లీకి చేరుకోనున్న ముఖ్యమంత్రి.. సాయంత్రం 5 గంటలకు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం.. ఆ తర్వాత సాయంత్రం 5.45 గంటలకు డ్రోన్ షో తిలకించనున్న రేవంత్ రెడ్డి..
* నేడు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా గాంధీభవన్ లో వేడుకలు.. ఉదయం 8.30 గంటలకు కేక్ కటింగ్.. ఉదయం 9 గంటలకు మెగా రక్తదాన శిబిరం.. పాల్గొననున్న సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..
* నేడు తెలంగాణ సచివాలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రజాపాలన- విజయోత్సవాల్లో భాగంగా ట్రాఫిక్ ఆంక్షలు.. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కొనసాగనున్న ఆంక్షలు..
* నేడు తెలంగాణ బంద్ కు మావోయిస్టుల పిలుపు.. ములుగు జిల్లా చల్నాక ఎన్ కౌంటర్ కు నిరసనగా పిలుపు.. ఆహారంలో విషప్రయోగం చేసి కాల్చి చంపారని ఆరోపణ.. మావోయిస్టుల బంద్ పిలుపుతో ఏజెన్సీలో ఉద్రిక్తత.. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ సరిహద్దులో తనిఖీలు..
* నేడు కాకినాడలో టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు.. 14 రౌండ్లలో 9 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు.. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఐదుగురు అభ్యర్థులు.. ఓటు వేసిన 15,490 మంది ఓటర్లు..
* నేడు కడప సైబర్ క్రైమ్ పీఎస్ కు వెళ్లనున్న ఎంపీ అవినాష్ పీఏ రాఘవరెడ్డి.. ఇప్పటికే నోటీసులు అందజేసిన పోలీసులు..
* నేడు మహానంది క్షేత్రంలో ప్రత్యేక పూజలు.. స్వామివారికి అభిషేకాలు, మహారుద్రాభిషేకం.. సోమవారం కావడంతో సాయంత్రం పల్లకి సేవ.
* నేటి నుంచి తూ.గో జిల్లాలో రెండు రోజుల పాటు పింఛన్లు తనిఖీలు.. దివ్యాంగ, ఇతర కేటగిరిలో అనర్హులు లబ్ధి పొందుతున్నట్లు ఆరోపణలపై తనిఖీ.. పింఛన్ల తనిఖీలకు పక్క మండలానికి చెందిన సిబ్బంది నియమకం..
* నేటితో ముగియనున్న బోరుగడ్డ అనిల్ కస్టడి.. పోలీస్ కస్టడీలో చంద్రబాబు, జడ్జీలపై వ్యాఖ్యలు చేసిన బోరుగడ్డ అనిల్..
* నేడు ఏపీ హైకోర్టులో కుక్కల విద్యాసాగర్ రావు బెయిల్ పిటిషన్ విచారణ.. ఇప్పటికే విద్యాసాగర్ బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన దిగువ కోర్టు.. జత్వానీ కేసులో రిమాండ్ లో ఉన్న కుక్కల విద్యాసాగర్ రావు..
* నేడు విశాఖ డెయిరీకి శాసనసభ హౌస్ కమిటీ.. అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదుపై క్షేత్రస్థాయి పరిశీలన.. కలెక్టరేట్ లో సమీక్ష తర్వాత నివేదిక కోరనున్న కమిటీ..
* నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 71, 140.. 24 క్యారెట్ల 10 గ్యాముల బంగారం రూ. 77,610.. హైదరాబాద్ లో కిలో వెండి రూ. 99, 900.