NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

*నేడు తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన.. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడ, వరంగల్‌లో ప్రధాని పర్యటన.

*నేడు మరోసారి ఏపీకి ప్రధాని మోడీ.. మధ్యాహ్నం 3.35 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుపతి ఎయిర్‌పోర్టుకు ప్రధాని.. తిరుపతి నుంచి హెలికాప్టర్‌లో రాజంపేట కలికిరికి వెళ్లనున్న మోడీ.. మధ్యాహ్నం 3.45 గంటలకు కలికిరిలో ప్రధాని మోడీ బహిరంగ సభ.. సాయంత్రం 5.20 గంటలకు హెలికాప్టర్‌లో తిరుపతి ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ.. సాయంత్రం 6.25 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ.. రాత్రి 7 గంటలకు రోడ్డు మార్గాన బందర్‌ రోడ్డు ఇందిరా గాంధీ స్టేడియానికి మోడీ.. స్టేడియం నుంచి బెంజ్‌ సర్కిల్ వరకు గంటసేపు ప్రధాని మోడీ రోడ్‌ షో.. అనంతరం గన్నవరం నుంచి ఢిల్లీకి ప్రధాని మోడీ పయనం.

*ఇవాళ ఆర్మూర్, నిజామాబాద్ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన.. సాయంత్రం 5 గంటలకు ఆర్మూర్ కార్నర్ మీటింగ్.. రాత్రి 7 గంటలకు నిజామాబాద్ రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్న సీఎం.

*నేడు మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో రెండోరోజు కేసీఆర్‌ బస్సుయాత్ర.. నర్సాపూర్, పటాన్‌చెరులో స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్న కేసీఆర్.

*అమరావతి: నేడు హోం ఓటింగ్‌కు ఆఖరి రోజు.. మిగిలిన ఓటర్లకు ఈ సాయంత్రం 5 గంటల వరకు హోం ఓటింగ్‌ ప్రక్రియ

*శ్రీ సత్యసాయి జిల్లా : హిందూపురం రూరల్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

*నేడు లఖింపూర్ ఖేరీ-కన్నౌజ్‌లో అమిత్ షా ఎన్నికల ప్రచారం..

*ఐపీఎల్: నేడు హైదరాబాద్‌ వర్సెస్ లక్నో.. ఉప్పల్‌ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్.

*తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,390.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,360.. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.88,600.

Show comments