NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

*హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. మొత్తం 90 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్.. 90 స్థానాలకు పోటీలో 1,031 మంది అభ్యర్థులు.. పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు.. సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్‌పోల్స్.

*విజయవాడ: ఇవాళ అన్నపూర్ణాదేవి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనం.. అన్నపూర్ణాదేవి దర్శనం అన్నపానాదులకు లోటు రానివ్వదని ప్రతీతి.. ఉదయం 5 గంటల నుంచే క్యూలైన్లలో భక్తులు.. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా తాగునీరు, పాలు ఏర్పాటు.. వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాటు.

*తిరుమల: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో రెండో రోజు.. ఉదయం 8 గంటలకు చిన్నశేషవాహనం పై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి.. రాత్రి 7 గంటలకు హంస వాహనంపై దర్శనం ఇవ్వనున్న శ్రీవారు.

*తిరుమల: ఇవాళ ఉదయం 7:35 గంటలకు వకూలమాత వంటశాలను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.. ఉదయం 7:55కి తిరుమల పర్యటన ముగించుకొని రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లనున్న ముఖ్యమంత్రి

*గుంటూరు: నేడు మంగళగిరిలో వివిధ రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మన్ల బాధ్యతల స్వీకరణ.. నేడు ఏపీఐఐసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న మంతెన రామరాజు.. ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు ఛైర్మన్‌గా నేడు పదవి బాధ్యతలు చేపట్టనున్న దామర్ల సత్య.

*శ్రీశైలంలో మూడో రోజు దసరా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు.. సాయంత్రం చంద్రఘంటా అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి దర్శనం.. రావణవాహనంపై ప్రత్యేక పూజలందుకోనున్న ఆది దంపతులు.. రాత్రి క్షేత్ర పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవారి గ్రామోత్సవం.

*నేటి నుంచి భారత్-బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయం.. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి పేటీఎం ఇన్‌సైడర్‌ వెబ్‌సైట్‌/యాప్‌లో విక్రయం.. ఈ నెల 12న ఉప్పల్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ 3వ టీ-20 మ్యాచ్.. భారత్-బంగ్లా టీ20 మ్యాచ్ టికెట్ల ధర రూ.750-రూ.15 వేలు.. ఈ నెల 8-12 మధ్య జింఖానా గ్రౌండ్‌లో టికెట్ల అందజేత.

*హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.71,210.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 77,680.. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.1,00,900.

Show comments