NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

*అమరావతి: ఇవాళ ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం.. సీఆర్‌డీఏ ఆమోదించిన 23 అంశాలకు ఆమోదం తెలపనున్న కేబినెట్.. కాకినాడ పోర్ట్‌ అంశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం.. పలు ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్లు, డీపీఆర్‌లపై చర్చించనున్న కేబినెట్.. సోషల్ మీడియా వేధింపుల కేసులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ.

*నెల్లూరు: రేపు శ్రీహరికోటలో పీఎస్‌ఎల్‌వీ.సీ-59 రాకెట్ ప్రయోగం.. సాయంత్రం 4:08 నిమిషాలకు సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ప్రయోగం.. ఇవాళ మధ్యాహ్నం 3:08 నిమిషాలకు కౌంట్‌డౌన్ ప్రారంభం.. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టనున్న రాకెట్.. ఇవాళ శ్రీహరికోటకు రానున్న ఇస్రో ఛైర్మన్ డాక్టర్‌ సోమనాథ్.

*హైదరాబాద్‌: నేడు వరద నీటి సంపుల నిర్మాణం ప్రారంభం.. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా వరద నీటి సంపుల నిర్మాణం.. ఇవాళ సచివాలయం వద్ద ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. వరద నీరు, ట్రాఫిక్ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు సంపుల నిర్మాణం.. హైదరాబాద్‌ వ్యాప్తంగా 12 ప్రాంతాల్లో పనులు ప్రారంభం.. ఒక్కో సంపు సామర్థ్యం లక్ష లీటర్ల నుంచి 10 లక్షల లీటర్లు.. వరద నీటిని రోడ్ల మీద నుంచి సంపులోకి పంపి అక్కడి నుంచి పైపుల ద్వారా కాలువల్లోకి మళ్లింపు.

*పుదుచ్చేరి: వర్షాల నేపథ్యంలో పుదుచ్చేరిలో స్కూల్స్, కాలేజీలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

*తిరుపతి: నేడు పద్మావతి అమ్మవారికి గరుడ వాహన సేవ.. పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉదయం సర్వభూపాల వాహనం.. సాయంత్రం నాలుగు గంటలకు స్వర్ణ రథోత్సవం.. రాత్రికి గరుడసేవ.. గరుడవాహన సేవ సందర్భంగా సుమారు రెండువేల మందితో పోలీస్, విజిలెన్స్ సహా ఇతరులతో భారీ భద్రత ఎర్పాటు…

*తిరుమల:.ఇవాళ స్థానికులకు దర్శనం.. నిన్న టోకెన్లు జారీ చేసిన టిటిడి

*చెన్నై: సేలం టూ బెంగుళూరు హైవే మూసివేత.. భారీ వర్షాలకు తోడు వరదలు రావడంతో హైవేను తాత్కాలికంగా మూసివేసిన అధికారులు.. ఇప్పటికే పలు వాహనాలు నీటిలో మునిగిపోయిన వైనం‌.. సేలం హైవేపై మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌‌.

*తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.70,890.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.77,340.. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.99,400.

Show comments