Site icon NTV Telugu

What’s Today: ఈరోజు ఏమున్నాయంటే?

What's Today Ntv

What's Today Ntv

నేడు శ్రీశైలంలో ప్రధాని మోడీ పర్యటన.. ఉదయం 9.50కి కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న ప్రధాని.. ఉదయం 10.35కి సుండిపెంట హెలిప్యాడ్‌కు ప్రధాని మోడీ.. ఉదయం 10.55కి శ్రీశైలం భ్రమరాంబ అతిథి గృహం చేరుకోనున్న ప్రధాని.. ఉదయం 11.15 నుంచి మధ్యాహ్నం 12.05 వరకు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి మోడీ ప్రత్యేక పూజలు.. మధ్యాహ్నం 12.40కి భ్రమరాంబ అతిథి గృహానికి ప్రధాని మోడీ

శ్రీశైలంలో ప్రధాని మోడీ పర్యటనకు సర్వం సిద్ధం.. మోడీ పర్యటనకు కేంద్ర భద్రతా బలగాల పర్యవేక్షణ.. భద్రతావలయంలో శ్రీశైల క్షేత్రం.. ప్రధాని మోడీ పర్యటన పూర్తయ్యే వరకు శ్రీశైలంలో రూట్లో అమలులోకి రానున్న ట్రాఫిక్ ఆంక్షలు

నేటి నుంచి కల్నల్ సీకే నాయుడు అంతర్రాష్ట్ర అండర్ _ 23 క్రికెట్ పోటీలు.. అనంతపురం ఆర్డిటి మైదానంలో బీసీసీఐ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు

నేడు రవాణా శాఖ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ వాహనాల మేళ

మావోయిస్టు అగ్రనేత ఆశన్న టీం లొంగుబాటు.. నేడు ఛత్తీస్‌గడ్ సీఎం ముందు లొంగిపోనున్న ఆశన్న.. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న ఆశన్న.. ఆయుధాలతో సహా లొంగిపోనున్న దాదాపు 70 మంది మావోయిస్టులు

నేడు మిత్రమండలి సినిమా రిలీజ్.. ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్స్.. మిత్రమండలికి దర్శకత్వం వహించిన విజయేందర్.. ముఖ్య పాత్రలు పోషించిన బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విటివి గణేష్

మహిళల వన్డే ప్రపంచకప్‌ 2025లో భాగంగా నేడు ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్.. విశాఖపట్నంలో మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ఆరంభం

Exit mobile version