ఇవాళ తాడేపల్లి నుంచి బెంగుళూరుకు మాజీ సీఎం వైఎస్ జగన్.. ఉదయం 11.05 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 11.35 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న జగన్.. మధ్యాహ్నం 2.40 గంటలకు బెంగుళూరులోని తన నివాసానికి చేరుకోనున్న జగన్
నేడు విజయవాడ నగరానికి రానున్న మహిళల ఇండియన్ క్రికెట్ టీమ్ క్రీడాకారిణి శ్రీ చరిణి.. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి భారీ ర్యాలీ
ఉదయం 10 గంటలకు సీఎం చంద్రబాబుని కలవనున్న ఉమెన్ క్రికెటర్ శ్రీచరణి.. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో శ్రీ చరణికి స్వాగతం పలకనున్న ఇద్దరు మహిళా మంత్రులు, మంత్రి రాంప్రసాద్ రెడ్డి,ఎంపీ కేశినేని చిన్ని, శాప్ చైర్మన్ రవి నాయుడు.. శ్రీ చరణికి భారీ నజరానా ప్రకటించనున్న ప్రభుత్వం.. చంద్రబాబును కలిసిన తర్వాత మంగళగిరిలోని క్రికెట్ స్టేడియంను సందర్శించనున్న శ్రీ చరణి
నేడు గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాలలో పాల్గొనున్న సీఎం.. తాడికొండ మండలం లాంలో ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్శిటీలో జయంతి ఉత్సవాలు
నేడు దుర్గగుడి ధర్మకర్తల మండలి తొలి సమావేశం.. మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ప్రారంభం.. మాస్టర్ ప్లాన్ అమలు, ఆలయ అభివృద్ధి, భక్తులకు సౌకర్యాలు తదితర అంశాలపై చర్చ
లిక్కర్ కేసులో నేటితో ముగియనున్న నిందితుల రిమాండ్.. ఏడుగురు నిందితులను నేడు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్న సిట్ అధికారులు
వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా నేడు కాకినాడలో బీజేపీ ఆధ్వర్యంలో ఆయోజనం కార్యక్రమం.. హాజరుకానున్న రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
పదో రోజు ఏడుపాయల ఆలయం మూసివేత.. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి కొనసాగుతున్న పూజలు.. సింగూరు ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయడంతో ఆలయం ఎదుట ప్రవహిస్తున్న మంజీరా నది.. బారికేడ్లు పెట్టి అమ్మవారి గర్భగుడి వైపు ఎవరు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్న అధికారులు
వందే మాతరం జాతీయ గేయం 150వ వార్షికోత్సవాలు.. దేశ వ్యాప్తంగా ఏడాది పొడవున జాతీయ గేయం వార్షికోత్సవాలు.. ఈరోజు ఉదయం 9.50 గంటలకు పాట్నాలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా
నేడు వందే మాతరం జాతీయ గేయం 150 వ వార్షికోత్సవాలు.. ఉదయం 9.30 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో వార్షికోత్సవాలను ప్రారంభించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
నేడు సుధీర్ బాబు నటించిన జటాధర, తిరువీర్ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాలు రిలీజ్
