NTV Telugu Site icon

Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

* ఇవాళ 11వ రోజు రాజోలు నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ వారాహీ యాత్ర.. ఉదయం 10 గంటలకు రాజోలు నియోజకవర్గ ప్రముఖులతో భేటీ, 11 గంటలకు జనవాణి కార్యక్రమం.. సాయంత్రం 5 గంటలకు మల్కిపురం కాలేజీ సెంటర్‌లో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ.. నేటితో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ముగియనున్న పవన్ వారాహి యాత్ర
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో వెంకటాచలం మండల నేతలతో సమావేశం
* ఈరోజు పశ్చిమగోదావరి జిల్లాలో ప్రారంభం కానున్న పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర.. రాత్రికి చించినాడ బ్రిడ్జి మీదగా నరసాపురం చేరుకొనున్న పవన్ కళ్యాణ్.. రేపు నర్సాపురంలో బహిరంగ సభ
* నేడు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. రానున్న మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం.. తీరం వెంబడి 40-50కి.మీ. వేగంతో బలమైన గాలులు.. అలజడిగా సముద్రం.. చేపల వేట నిషేధం
* నంద్యాల: నేడు ఏపీ మహిళా సమాఖ్య జిల్లా మహాసభ
* అనకాపల్లి జిల్లా: నేడు సాయంత్రం ఐదు గంటలకు అనకాపల్లి పెంటకోట కన్వెన్షన్ హాల్లో వివి రమణ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
* నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. సిద్దిపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు
* ఖమ్మం: నేడు తన అనుచరులతో ఢిల్లీ వెళ్లనున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రనివాసరెడ్డి.. వచ్చే నెలలో ఖమ్మంలో బహిరంగ సభలో కాంగ్రెస్‌లో చేరనున్న పొంగులేటి, జెడ్పీ ఛైర్మెన్ కొరం కనకయ్యలు
* నాగర్ కర్నూల్: నేడు నాగర్ కర్నూల్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. బీజేపీ నవ సంకల్ప సభలో పాల్గొననున్న జేపీ నడ్డా.. నడ్డా సభకు ఏర్పాట్లు పూర్తి
* నిర్మల్: జిల్లాలో ఇవ్వాళ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన.. పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి
* నేడు మెదక్ జిల్లాలో కేంద్ర మంత్రి పరుషోత్తం రూపాల పర్యటన.. మహాజన్ సంపర్క్ అభియాన్‌లో బాగంగా మెదక్ జిల్లాలో పర్యటించనునున్న కేంద్ర మంత్రి
* నంద్యాల: పాణ్యం (మం) కొత్తూరు శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రంలో నేడు నాగదోష పూజలు.. స్వామివారికి ప్రత్యేక అలంకరణలు, విశేష పూజలు

Show comments