NTV Telugu Site icon

Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

* నేడు పోలవరంలో సీఎం జగన్ పర్యటన.. 10:45 గంటలకు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకోనున్న సీఎం జగన్.. ప్రాజెక్టు నిర్మాణ పనుల పరిశీలన అనంతరం ఇంజనీరింగ్, ఇతర శాఖల అధికారులతో సీఎం జగన్ సమీక్ష
* తాడేపల్లిగూడెంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటన.. వెంకటరామన్నగూడెం, డా YSR ఉద్యాన యూనివర్సిటిలో నూతనంగా నిర్మించిన సెంట్రల్ లైబ్రరీ ప్రారంభించనున్న మంత్రి.. అనంతరం రైతులుతో ముఖాముఖి
* నేడు తిరుపతి తారకరామ స్టేడియంలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుక.. సాయంత్రం ఆరుగంటల నుండి ఈవెంట్ ప్రారంభం.. ఈవెంట్ నేపథ్యంలో నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు.. స్టేడియం వద్ద భారీ భద్రత
* నేడు హోంమంత్రి తానేటి వనిత పర్యటన కార్యక్రమాలు.. ఉదయం 8 గంటలకు కొవ్వూరు క్యాంపు ఆఫీసు నుండి బయలుదేరనున్న మంత్రి.. ఉదయం 9 గంటలకు పోలవరం హెలిప్యాడ్ వద్ద సీఎం జగన్‌కు స్వాగతం.. పోలవరం ప్రాజెక్టుల్ని సీఎం కలిసి పరిశీలించిన అనంతరం తిరిగి కొవ్వూరు క్యాంపు ఆఫీసుకు చేరిక.. సాయంత్రం కొవ్వూరులోని స్థానిక కార్యక్రమాల్లో భాగం
* నేడు తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం.. ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు వర్ష సూచన.. పలుచోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం..
* నేడు తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ
* నేటి నుంచి సింగపూర్ ఓపెన్ టోర్నీ.. పీవి సింధుకు తొలి రౌండ్‌లో కఠిన ప్రత్యర్థి యమగూచి

Show comments