Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

నేటితో ముగియనున్న మాజీ మంత్రి కాకణి పోలీస్ కష్టడి.. రెండు రోజుల పాటు కాకణి లాయర్ సమక్షంలో విచారించిన పోలీసులు

నేటి నుండి కోనసీమ జిల్లాలో 20 ఇసుక రీచ్‌లలో ప్రత్యక్ష విక్రయాలు నిలుపుదల.. రుతుపవనాలు సమీపిస్తున్నందున బహిరంగ ఇసుక రీచ్‌లలో విక్రయాలు నిలుపుదల.. స్టాక్ యార్డుల ద్వారా మాత్రమే ఇసుక విక్రయాలు

నేడు కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ పార్క్ లో యోగాంధ్ర కార్యక్రమం.. కార్యక్రమంలో పాల్గొననున్న మున్సిపల్ కమిషనర్, ప్రజలు

నెల్లూరు జిల్లా ముత్తుకూరు గేటు వద్ద మాజీ మంత్రి ఆనం వెంకటరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ.. అనంతరం జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రులు

నేడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. మొత్తం ముగ్గురికి కేబినెట్‌లో చోటు.. మంత్రులుగా వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి.. డిప్యూటీ స్పీకర్‌గా రామచంద్రు నాయక్.. డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికకు రెండు రోజుల్లో నోటిఫికేషన్

ఇవాళ భారత్‌కు చేరుకోనున్న ప్రభాకర్ రావు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్

హైదరాబాద్‌లో నేడు, రేపు చేప మందు పంపిణీ.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు పూర్తి

ఫ్రెంచ్‌ ఓపెన్‌ 2025లో ఆఖరి సమరానికి రంగం సిద్ధం.. పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ కోసం డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కార్లోస్‌ అల్కరాస్‌తో తలపడనున్న యానిక్‌ సినర్‌

ఇంగ్లాండ్‌ లయన్స్‌తో భారత్‌-ఎ రెండో అనధికార టెస్టు.. మూడో రోజు ఆదివారం కొనసాగనున్న మ్యాచ్.. తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసిన ఇంగ్లాండ్‌ లయన్స్‌.. తొలి ఇన్నింగ్స్‌లో 348 రన్స్ చేసిన భారత్‌-ఎ

 

Exit mobile version