* నేడు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత ల సమక్షంలో చేరికలు.. కాంగ్రెస్ లో చేరనున్న ఇతర పార్టీ నేతలు.. నేడు కాంగ్రెస్‌లో చేరనున్న కుంభం అనిల్ ( భువనగిరి ).. వేముల వీరేశం (నకిరేకల్).. మైనం పల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్, రేఖా శ్యామ్ నాయక్, అరేపల్లి మోహన్ ( మానకొండూర్ ).. రాహుల్ గాంధీ, ఖర్గే సమక్షంలో చేరికలు
* నేడు రాజస్థాన్‌కి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే
* అమరావతి: మూడో రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
* నేడు, రేపు చంద్రబాబును ప్రశ్నించనున్న ఏపీ సీఐడీ.. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశ్నించనున్న సీఐడీ.. చంద్రబాబును రెండు రోజుల కస్టడీకి అనుమతించిన ఏసీబీ కోర్టు
* ప్రకాశం : యర్రగొండపాలెం మండలం గురిజేపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్..
* ప్రకాశం : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు..
*ప్రకాశం : ఒంగోలులో సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన పోరుబాట పాదయాత్ర ముగింపు కార్యక్రమం, ముఖ్య అతిథిగా హాజరుకానున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరులో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ వెంకటాచలం మండలం గొలగమూడి లోని శ్రీ వెంకయ్య స్వామి ఆలయంలో టిడిపి నేత సోమిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
* సైదాపురం మండలం కలిచేడులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న వెంకటగిరి వైసీపీ సమన్వయకర్త రాంకుమార్ రెడ్డి
* విశాఖ: నేడు వికేంద్రీకరణ జేఏసీ మీటింగ్.. హాజరుకానున్న వైవీ సుబ్బారెడ్డి, మంత్రి అమర్నాథ్
* విశాఖకు నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి రాక.. నరేంద్రమోడీ జన్మదినోత్సవం సందర్బంగా సేవా పక్షోత్సవాల్లో పాల్గొననున్న పురంధేశ్వరి
* ఏలూరు : నేడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ద్వారకాతిరుమల పర్యటన.. ఉ. 9:15 గంకు చిన వెంకన్నను దర్శించుకొనున్న స్పీకర్ సీతారాం
* పశ్చిమగోదావరి జిల్లాలో నేడు మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పర్యటన.. మధ్యాహ్నం 2:30 గంటలకు తణుకు పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ నందు తణుకు నియోజకవర్గంలోని “వైఎస్ఆర్ కాపు నేస్తం” పంపిణీ చేయు భారీ బహిరంగ సభ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 6:00 గంటల తణుకు పట్టణంలోని శ్రీ వినాయకుని మండపాలు దర్శించుకుంటారు.
* అంబేద్కర్ కోనసీమ జిల్లా : కోనసీమ తిరుపతిలో ప్రసిద్ది గాంచిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో పోటెత్తిన భక్తులు.. ఇవాళ శనివారం కావడంతో తెల్లవారుజాము నుండే పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్న భక్తులు.. ఏడు శనివారాలు స్వామి వారి దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరతాయని భక్తుల విశ్వాసం
* పశ్చిమ గోదావరి జిల్లాలో నేడు మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటన.. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తాడేపల్లిగూడెం పట్టణంలోని 1 వ వార్డులో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2.0 లో భాగంగా ర్యాలీని ప్రారంభిస్తారు. అనంతరం 60 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో చేపట్టే సిసి రోడ్లు, డ్రైన్లు నిర్మాణం, పైపులైన్ వేసే పనులకు శంకుస్థాపన లు చేస్తారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా గాంధీ పార్క్ లో 1 నుంచి 7 వార్డులకు చెందిన ఆర్.పి.లు, వాలంటీర్లు, సచివాలయం సెక్రటరీలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు.
* అనంతపురం : బ్రహ్మసముద్రం మండల పరిధిలోని తీటకల్లు గ్రామంలో నిర్వహించనున్న వై.యస్.ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్ .
* విశాఖ: చీఫ్ సెక్రెటరీ జవహర్ రెడ్డి రెండు రోజుల పర్యటన.. విశాఖ రాజధాని నేపథ్యంలో సీఎస్ షెడ్యూల్ పై ఆసక్తి.. EPGC ఆహ్వానం మేరకు జవహర్ రెడ్డి పర్యటన.
* అంబేద్కర్ కోనసీమ: నేడు రామచంద్రాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనున్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
* నేడు సంగారెడ్డి జిల్లా జెడ్పి సర్వసభ్య సమావేశం.. సమావేశానికి హాజరుకానున్న మంత్రి హరీష్ రావు, జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు
* తిరుమల: ఆరో రోజు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం పై.. సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథంపై.. రాత్రి 7 గంటలకు గజ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి
* తిరుమల: 31 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 72,650 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 27,410 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.33 కోట్లు