నేడు మేడిగడ్డకు కేంద్ర జలసంఘం సభ్యులు.. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సభ్యులు అనిల్‌జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల నిపుణుల బృందంతో కుంగిన బ్యారేజ్ పరిశీలన..
నేడు విజయదశమి సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాకాత్ లకు సెలవు..
నేడు 46వ రోజుకు చేరిన రాజమండ్రి సెంట్రల్ జైలులోని టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్..
నేడు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్న నారా భువనేశ్వరి.. అనంతరం తమ స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లనున్నారు..
నేడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సర్వేపల్లి నియోజకవర్గ నేతలతో సమావేశం..
నేడు దేవరగట్టులో బన్నీ ఉత్సవం.. అర్ధరాత్రి మాల మలల్లేశ్వరస్వామి కల్యాణోత్సవం.. ఉత్సవ విగ్రహాలను సొంతం చేసుకునేందుకు తెల్లవారేవరకు గ్రామాల మధ్య కర్రల సమరం..
నేడు సింహాచలం దేవస్థానంలో జమ్మివేట ఉత్సవం.. పూలతోటలో విహరించనున్న స్వామివారు.. రామావతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న లక్ష్మీ నృసింహస్వామి.. సాయంత్రం 6గంటల వరకే అప్పన్న స్వామి దర్శనాలు..
నేటి నుండి 29 వరకు ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు..
నేడు భద్రాచలం రామాలయంలో దసరా వేడుకలు శమీ పూజ.. భద్రాచల శ్రీసీతారామచంద్ర స్వామివారి దివ్య సన్నిధిలో ఘనంగా జరుగుతున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నేటితో ముగింపు..
నేడు వరల్డ్ కప్ లో జరిగే మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడనున్న సౌతాఫ్రికా.. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం.. ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్