* కర్ణాటక నూతన సీఎంపై కొనసాగుతోన్న ఉత్కంఠ.. ఈ రోజు ఉదయం మరోసారి ఖర్గేతో భేటీ కానున్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్.. ఇరువురు నేతలతో నేడు రెండవ విడత చర్చలు తర్వాత అంతిమ నిర్ణయం ప్రకటించనున్న పార్టీ
* ఐపీఎల్‌లో నేడు పంజాబ్‌తో ఢిల్లీ ఢీ.. ధర్మశాల వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్
* ఇవాళ సీఎం వైఎస్ జగన్ విజయవాడ పర్యటన.. శ్రీ లక్ష్మీ మహ యజ్ఞం అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం.. ఉదయం 8.50 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం.. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు చేరుకుని శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి జగన్.
* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లని నిండి వెలుపల క్యూ లైనులో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 77,486 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 38,980 మంది భక్తులు. హుండీ ఆదాయం రూ.3.77 కోట్లు
* తూర్పుగోదావరి జిల్లా : నేడు రాజమండ్రి కలెక్టరేట్ లో జిల్లా సమీక్షా కమిటీ సమావేశం.. ఇంఛార్జ్ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అధ్యక్షతన సమావేశం.. హాజరుకానున్న హోం మంత్రి డా.తానేటి వనిత, జిల్లా కలెక్టర్ డా.కే. మాధవీలత, పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు.
* ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొననున్న మంత్రి ఆదిమూలపు సురేష్..
* కడప : నేడు జమ్మలమడుగు స్థానిక ఏరియా ఆసుపత్రిలో అత్యవసర సదరం శిబిరం. దివ్యాంగులు ఆందోళనల నేపథ్యంలో శిబిరం ఏర్పాటు..
* నెల్లూరు జిల్లా: పొదలకూరు మండలాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి
* నెల్లూరులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా.. బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలో శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షిత అమ్మవారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు వెండి నంది సేవ
* కడప : నేడు లింగాల మండలంలో పర్యటించనున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. రెండు కోట్లతో నిర్మించిన లింగాల కుడి గట్టు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించ నున్న ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి..
* ఉత్తరాంధ్రలో చంద్రబాబు మూడు రోజుల పర్యటన.. నేడు పెందుర్తి నియోజకర్గంలో రోడ్ షో, పబ్లిక్ మీటింగ్.. పంచగ్రామాల భూ సమస్యపై ఫిర్యాదులు స్వీకరించనున్న చంద్రబాబు
* తూర్పుగోదావరి జిల్లా : నేడు హోం మంత్రి తానేటి వనిత కార్యక్రమాలు.. సాయంత్రం 04:30 గంటలకు కొవ్వూరు టౌన్ 4 వ వార్డు నందు జరుగు గడప గడపకు మన ప్రభుత్వం(107రోజు ) కార్యక్రమంలో పాల్గొంటారు.
* శ్రీ సత్యసాయి : మడకశిర పట్టణంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.
* శ్రీ సత్యసాయి : ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని రైతు భరోసా కేంద్రాల్లో నేటి నుండి వేరుశనగ విత్తనం కొరకు రైతు పేర్లు నమోదు కార్యక్రమం.
* అనంతపురం : కంబదూరు మండల పరిధిలోని నూతిమడుగు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఉషాశ్రీచరణ్.
* కర్నూలు: నేడు 102వ రోజు యువగళం పాదయాత్ర.. నంద్యాలలో కొనసాగనున్న పాదయాత్ర
* నేడు 20 మండలాల్లో వడగాల్పులు ప్రభావం.. అనకాపల్లి జిల్లా 2, గుంటూరు 2, కాకినాడ 1, ఎన్టీఆర్ 3, పల్నాడు 3, వైఎస్సార్ జిల్లాలో 9 మండలాల్లో వడగాల్పులు ప్రభావం.. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం-డా.బి.ఆర్ అంబేద్కర్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల సంస్థ
* నేడు భద్రాచలంలో గవర్నర్ తమిళసై పర్యటన… ఉదయం సీతారామ చంద్ర స్వామి దర్శనం, గిరిజనులతో సమావేశం..
* నేడు మధ్యాహ్నం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న గవర్నర్ తమిళసై.. రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులతో సమావేశం