NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

నేడు మహారాష్ట్రకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. కొల్హాపూర్‌లోని శ్రీ మహాలక్షి ఆలయాన్ని బాబు సందర్శించనున్నారు. మధ్యాహ్నం షిరిడీ సాయిబాబాను దర్శించుకొనున్నారు.

నేడు ఢిల్లీకి ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెళ్లనున్నారు. రాష్ట్రంలో హింసను కంట్రోల్ చేసేందుకు తీసుకున్న చర్యలపై సీఈసీకి వివరణ ఇవ్వనున్నారు.

నేటి నుంచి ఏపీ ఈఏపీఎస్ ప్రారంభం కానుంది. ఇంజినీరింగ్‌, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్‌ గురువారం నుంచి ప్రారంభమవుతుందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి తెలిపారు. నిమిషం ఆలస్యం అయినా పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదు.

నేడు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు నిరసనలు చేపట్టనున్నారు. రైతాంగం సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేయనుంది.

ఈరోజు మద్యాహ్నం తరువాత సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ప్రభుత్వంకు ఆదాయం తెచ్చే శాఖలపై నేడు సమీక్ష చేయనున్నారు. ఆదాయం పెంపు మార్గాలపై అధికారులతో సీఎం చర్చించనున్నారు. ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ శాఖలతో పాటు పలు శాఖల అధికారులు సమీక్షకు హాజరుకానున్నారు.

Also Read: SRH vs GT: గుజరాత్‌తో హైదరాబాద్ ఢీ.. ప్లేఆఫ్స్‌పై సన్‌రైజర్స్‌ గురి!

ఐపీఎల్‌ 2024లో భాగంగా నేడు గుజరాత్‌తో సన్‌రైజర్స్‌ ఢీ కొట్టనుంది. హైదరాబాద్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ప్రస్తుతం 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించిన సన్‌రైజర్స్‌.. 14 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఉన్న సమీకరణాల దృష్ట్యా సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టేందుకు ఒక్క పాయింట్‌ మాత్రమే చాలు. గుజరాత్‌పై విజయం సాధిస్తే.. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సగర్వంగా ప్లేఆఫ్స్‌ చేరుతుంది.