Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

నేడు కర్నూలులో సీఎం జగన్ బస్సు యాత్ర.. ఆళ్లగడ్డలో ముఖ్యనేతలు, మేధావులతో మాట్లాడనున్న జగన్.. ఉదయం. 10 గంటలకు బస్సుయాత్ర ప్రారంభం.. ఎర్రగుంట్లలో వివిధ వర్గాల ప్రజలతో ముఖాముఖి.. రైతు నగరం వద్ద మధ్యాహ్న భోజనం.. సాయంత్రం 4 గంటలకు నంద్యాల డిగ్రీ కాలేజీలో మేమంతా సిద్ధం బహిరంగ సభ..
నేడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటన.. ఉదయం 11:00 గంటలకు రాప్తాడులో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు.. మధ్యాహ్నం 2: 30 గంటలకు బుక్కరాయసముద్రం సబ్ స్టేషన్ వద్ద బహిరంగ సభ.. సాయంకాలం 6:00 గంటలకు కదిరిలో బహిరంగ సభ..
నేడు రాజమండ్రిలో బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ సమావేశం.. ఈ సమావేశానికి అరుణ్ సింగ్ , పురంధేశ్వరి, సోము వీర్రాజుతో సహా ముఖ్య నేతల హాజరు..
నేడు ఒంగోలు నగరంలో పలు కార్యక్రమాలకు హాజరుకానున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఒంగోలులో జిల్లా బీజేపీ నేతల సమన్వయ కమిటీ సమావేశం.. హాజరుకానున్న పలువురు ముఖ్య నేతలు..
నేడు నెల్లూరు జిల్లాలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణీ గోవర్ధన్ రెడ్డి ముత్తుకూరు మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు..
నేడు ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారాంపురంలో జరిగే రోడ్ షోలో పాల్గొననున్న నెల్లూరు లోక్ సభ వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి.. అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి..
నేడు అనంతసాగరం మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి..
నేడు కావలి రూరల్ మండలంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి..
నేడు నెల్లూరు రూరల్ మండలం పడారుపల్లిలో ఇంటింట ప్రచారాన్ని నిర్వహించనున్న వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి..
నేడు విశాఖలో బహుజన సమాజ్ పార్టీ ఉత్తరాంధ్ర కార్యవర్గ సమావేశం.. బీఎస్పీ అభ్యర్థులను ప్రకటించనున్న మాజీ డీజీపీ పూర్ణ చంద్ర రావు, మాజీ ఎమ్మెల్యే లకే రాజారావు..
నేడు కడపలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పర్యటన.. సాయంత్రం ఇఫ్తార్ విందుకు హాజరు కానున్న డిప్యూటీ సీఎం..
నేడు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకోనున్న 1438 లోకల్ బాడీ ఓటర్లు.. జిల్లాలో 10 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు.. గోవా క్యాంప్ నుంచి జిల్లా సరిహద్దు ప్రాంతాలకు చేరుకున్న ఓటర్లు.. రాయచూరులో బీఆర్ఎస్ ఓటర్లు.. హైదరాబాద్ లో కాంగ్రెస్ ఓటర్లు.
నేడు తెలంగాణ హైకోర్టులో దానం నాగేందర్ కు వ్యతిరేకంగా పిటిషన్.. ఇవాళ విచారణ జరిగే అవకాశం..
నేడు వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం.. శివ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా నేస్వామివార్లకు ద్వజారోహణం, ఎదుర్కోళ్ళు కార్యక్రమాన్ని నిర్వహించనున్న ఆలయ అర్చకులు..
నేటితో ముగియనున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీ.. కేజ్రీవాల్ ను కోర్టులో హాజరు పర్చనున్న అధికారులు..
నేడు ఈడీ విచారణకు మహువా మొయిత్రా, హీరానందానీ.. ఫెమా ఉల్లంఘనల కేసులో విచారించనున్న ఈడీ అధికారులు..
నేడు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్.. రాత్రి 7. 30 గంటలకు జైపూర్ వేదికగా మ్యాచ్..

Exit mobile version