* హైదరాబాద్: నేడు దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమిలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ డే పరేడ్.. ముఖ్య అతిథిగా పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము.. నిన్న సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి
* అమరావతి: గడప గడపకు మన ప్రభుత్వంపై సీఎం జగన్ ఫోకస్.. ఈ నెల 21వ తేదీన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం సమీక్ష.. హాజరుకానున్న మంత్రులు , ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, జేసీయస్ రాష్ట్ర కో-ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు
* కాకినాడలో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. నేడు మేధావులతో సమావేశం.. జనవాణి, వినతులు స్వీకరించనున్న జనసేనాని, వీర మహిళలతో సమావేశం కానున్న పవన్
* బాపట్ల: చెరుకుపల్లి మండలం పెట్రోల్ దాడిలో మృతిచెందిన విద్యార్థి అమర్నాథ్ మృతదేహానికి నేడు అంత్యక్రియలు.. ఉప్పలవారిపాలెంలో అమర్నాథ్ అంత్యక్రియలలో పాల్గొనేందుకు రానున్న ప్రజా సంఘాలు, టీడీపీ నాయకులు.. ముందస్తు చర్యలో భాగంగా పరిసర ప్రాంతాల్లో పోలీసులను మోహరించిన ఉన్నతాధికారులు…
* తూర్పుగోదావరి జిల్లా : నేడు హోం మంత్రి తానేటి వనిత పర్యాటన కార్యక్రమాలు.. ఆనం కళాక్షేత్రంలో జరుగు జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో పాల్గొంటారు., చాగల్లు మండలం మార్కొండపాడు గ్రామంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొంటారు. కొవ్వూరు టౌన్ 16 వ వార్డు ఔరంగాబాద్ నందు జరుగు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి.
* ప్రకాశం : పెద్దారవీడు మండలం తంగిరాలపల్లిలో గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్..
* ప్రకాశం : ఒంగోలు గోపాల్ నగర్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..
* ప్రకాశం : మార్కాపురం శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణోత్సవం..
* ఏలూరులో మంత్రి విశ్వరూప్ పర్యటన.. జగనన్న అనుభవించాడు కార్యక్రమంలో విద్యార్థులకు పురస్కారాలు అందించనున్న మంత్రి.
* పశ్చిమ గోదావరి: తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పర్యటన.. జగనన్న విద్యా కానుక , ఆణిముత్యాలకు పురస్కారాలు కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి.
* పశ్చిమ గోదావరి: భీమవరంలో పర్యటించనున్న మంత్రి కొట్టు సత్యనారాయణ..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు కలెక్టరేట్‌లో జరిగే జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో పాల్గొంటారు
* అనంతపురం : గుంతకల్లు – చిక్ జూజూర్ స్పెషల్ ప్యాసింజర్ ర్తెళ్లు నేటి నుంచి తాత్కాలికంగా రద్దు.
* నేడు వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన.. ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కొనసాగనున్న కేటీఆర్ టూర్.. రూ.650 కోట్ల పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్న కేటీఆర్
* మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో వరంగల్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఓసిటీ గ్రౌండ్ లో బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నర్సంపేట నుంచి వరంగల్, హనుమకొండకు వచ్చే వాహనాలు తెలంగాణ జంక్షన్ చింతల్ ఓవర్ నుంచి పోర్టు రోడ్డు డ్రైవర్షన్, బట్టల బజార్ మీదుగా హనుమకొండకు వెళ్లాలని పోలీసుల సూచన.. హనుమకొండ నుంచి వెంకట్రామ జంక్షన్ నర్సంపేటకు వెళ్లే వాహనాలు ఎంజీఎం బట్టలబజార్ నుంచి పోర్ట్ రోడ్డు డ్రైవర్షన్, తెలంగాణ జంక్షన్ నుంచి మళ్లింపు .
* మంత్రి కేటీ రామారావు పర్యటన నేపథ్యంలో ప్రతిపక్షాల నాయకులను ముందస్తు అరెస్టులు చేసిన పోలీసులు
* ఆదిలాబాద్: నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఉట్నూర్ మండల కేంద్రం, జైనూరు మండలం మార్లవాయి గ్రామంలో నిర్వహించే తెలంగాణ గిరిజన ఉత్సవంలో పాల్గొననున్న మంత్రి .
* నేడు నిర్మల్ కు కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి.. సాయంత్రం పట్టణంలో జరిగే శోభాయాత్రలో పాల్గొననున్న పీఠాధిపతి
* నేడు మెదక్ జిల్లాలో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పర్యటన.. మెదక్ జిల్లా కోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న హైకోర్టు సీజే.. మెదక్ చర్చిని సందర్శించి, ఏడు పాయల అమ్మ వారిని దర్శించుకొనున్న సీజే
* పెద్దపల్లి జిల్లా : ముత్తారం మండలంలో నేడు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ పర్యటన.. మానేరువాగుపై నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించనున్న మంత్రులు