* అమరావతి: నేడు ఉదయం 11 గంటలకు అధికారులతో ఆర్థికశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష..
* తిరుమల: నేటితో ముగియనున్న శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు.. రేపటి నుంచి ఆర్జిత సేవలు పునఃరుద్దరణ
* కర్నూలు: మంత్రాలయంలో నేటి నుంచి శ్రీ రాఘవేంద్రస్వామి 352 సప్త ఆరాధనోత్సవాలు ప్రారంభం.. సెప్టెంబరు 4 వరకు జరగనున్న ఉత్సవాలు.. నేటి సాయంత్రం శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో ధ్వజరోహణ కార్యక్రమంతో ప్రారంభంకానున్న ఉత్సవాలు. 31న పూర్వ ఆరాధనలో పాల్గొననున్న గవర్నర్ అబ్దుల్ నజీర్
* తిరుమల: 25 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు, టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 68,263 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 28,355 మంది భక్తులు, హుండీ ఆదాయం రూ.3.65 కోట్లు
* విశాఖ: నేడు ఛలో ఆంధ్రా యూనివర్శిటీకి ఎస్.ఎఫ్.ఐ. పిలుపు.. సిలబస్ పూర్తయ్యే వరకు డిగ్రీ 2,4 సెమిస్టర్లు వాయిదా వేయాలని డిమాండ్
* విశాఖ: నేడు GVMC గాంధీ విగ్రహం దగ్గర జనసేన ఆధ్వర్యంలో మహాధర్నా.. భూ ఆక్రమణలు, అవినీతిపై పోరాటం అంటున్న జనసేన
* శ్రీకాకుళం జిల్లాలో నేడు స్పీకర్ తమ్మినేని సీతారాం పర్యటన.. ఉదయం 10 గంటలకు బూర్జ మండలం కొల్లివలస, సంకురాడ, నీలంపేట, బూర్జ గ్రామాలలో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కొళాయి శంకుస్థాపన మరియు బూర్జ లో డ్రైన్ స్ శంకు స్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. సరుబుజ్జిలి మండలం పెద్దసవలపురం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు.
* పాడేరు ఏజెన్సీలో తగ్గుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు.. పాడేరులో 20 , మినుములురులో 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు
* విశాఖ: నేటి నుంచి కోడికత్తితో దాడి కేసులో ఎన్.ఐ.ఏ. కోర్టు విచారణ.. నిందితుడు శ్రీనివాస్ ను హాజరుపరచనున్న పోలీసులు.. ఇప్పటి వరకు విజయవాడ ఎన్.ఐ.ఏ.కోర్టులో జరుగుతున్న కేసు. ఇటీవల 3వ జిల్లా కోర్టుకు కేసు బదిలీ.
* నేడు కాకినాడకు జిల్లా ఇంఛార్జి మంత్రి సీదిరి అప్పల రాజు.. కాకినాడ రూరల్, ప్రత్తిపాడు నియోజకవర్గాల అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించనున్న మంత్రి
* కాకినాడ: నేడు అచ్చంపేటలో టీడీపీ జోన్ 2 సమావేశ ప్రాంగణంకు భూమి పూజ చేయనున్న టీడీపీ నేతలు.. సెప్టెంబర్ 2న జోన్ 2 లో ఐదు పార్లమెంటులకు చెందిన కోఆర్డినేటర్లు ముఖ్య నేతలతో కాకినాడలో సమావేశం కానున్న చంద్రబాబు
* తూర్పుగోదావరి జిల్లా : నేడు రాజమండ్రిలో తెలుగుభాష దినోత్సవ వేడుకలు.. నన్నయ్య యూనివర్శిటీ, రాజమహేంద్రి మహిళ డిగ్రీ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమాలు
* తిరుమల: ఇవాళ టీటీడీ పాలకమండలి సభ్యులుగా ప్రమాణస్వీకారం చెయ్యనున్న మిలింద్ నర్వేకర్, సౌరభ్ బోరా
* పశ్చిమ గోదావరిలో నేడు మంత్రి కారుమూరి నాగేశ్వర రావు పర్యటన.. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం లోని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నందు జరుగు “హంస పురస్కారాల” కార్యక్రమంలో పాల్గొంటారు. తణుకు మండలం, వేల్పూరు గ్రామం లో ఉన్న గీత మందిరం వద్ద డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు నాలుగవ విడత “వైయస్సార్ సున్నా వడ్డీ” కార్యక్రమానికి హాజరవుతారు.
* పశ్చిమ గోదావరి: ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ సమీక్ష సమావేశంలో పాల్గొననున్న మంత్రి కొట్టు సత్యనారాయణ.
* గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో స్నాతకోత్సవానికి హాజరుకానున్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్…
* గుంటూరు: నేడు బృందావన్ గార్డెన్స్ లోని అన్నమయ్య కళావేదికలో రాష్ట్ర రచయితల సంఘం ఆధ్వర్యంలో తెలుగు భాష పురస్కారాల ప్రధానం..
* పల్నాడు: నేడు వినుకొండ మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం..
* తూర్పు గోదావరి జిల్లా: నేడు హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత షెడ్యూల్ వివరాలు.. చాగల్లు మండలం చాగల్లు గ్రామంలో సచివాలయం – 1 నందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం.. చాగల్లు మండలం చాగల్లు గ్రామంలో సచివాలయం – 1 నందు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు.
* ఏలూరు : నేటి నుండి సెప్టెంబర్ 1 వరకు ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో పవిత్రోత్సవాలు.. నేడు అంకురార్పణతో ఉత్సవాలకు శ్రీకారం, 30న పవిత్రాదివాసం, 31న పవిత్రావరోహణ, సెప్టెంబర్ 1న పూర్ణాహుతితో ఉత్సవాల ముగింపు.. పవిత్రోత్సవాల సమయంలో స్వామి వారికి జరిగే నిత్యార్జిత కళ్యాణాలు, ఆర్జిత సేవలు రద్దు