నేడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర.. ఉదయం 9 గంటల నుంచి అమ్మగారిపల్లె నుంచి ప్రారంభం కానున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. తేనెపల్లి, రంగంపేట క్రాస్ రోడ్ మీదుగా పూతలపట్టుకు జగన్.. మధ్యహ్నం పూతలపట్టులో వైసీపీ బహిరంగ సభ.. ఆ తర్వాత పి. కొత్తకోట, పాకాల, గదంకి, పనపాకం, చంద్రగిరి, రేణిగుంట మీదుగా గురువరాజుపల్లెకు సీఎం జగన్..
నేడు గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ కళ్యాన్ ఎన్నికల ప్రచారం.. సాయంత్రం 4 గంటలకు కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్న పవన్..
నేటి నుంచి చంద్రబాబు రెండో విడత ప్రజాగళం యాత్రలు.. నేడు అమలాపురం, రాజమండ్రి, నరసాపురం పార్లమెంట్ పరిధిలో చంద్రబాబు పర్యటన.. రావులపాలెం, రామచంద్రపురంలో బహిరంగ సభలు..
నేడు కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ భేటీ..
నేడు పెద్దపల్లి కాంగ్రెస్ లోక్ సభ నియోజకవర్గ సమీక్ష.. హైదరాబాద్ లో మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో జరగనున్న సమీక్ష..
నేడు భువనగిరి, చేవెళ్లలో బీఆర్ఎస్ నియోజకవర్గ సమావేశాలు.. భువనగిరి బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొననున్న హరీశ్ రావు.. చేవెళ్ల నియోజకవర్గ సమావేశంలో పాల్గొననున్న కేటీఆర్.
నేటి నుంచి ఈ నెల 6వ తేదీ వరకు ఏపీలో పెన్షన్ల పంపిణీ..
నేడు ఏపీ హైకోర్టులో పెన్షన్ల పంపిణీ వ్యవహారం.. వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయొద్దన్న ఈసీ ఆదేశాలపై స్టే ఇవ్వాలని పిటిషన్.. ఇవాళ విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు..
నేటి నంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల ఎంపిక తీరును నిరసిస్తూ మాదిగలు నిరసనలు చేపట్టనున్నట్లు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిక పిలుపు..
నేడు బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు.. ఛత్తీస్ గడ్ లో వరుస ఎన్ కౌంటర్లకు నిరసనగా ఏజెన్సీలో బంద్.. తెలంగాణ సరిహద్దులో పోలీసులు అలెర్ట్..
నేడు, రేపు కొత్తగా ఎన్నికైనా రాజ్యసభ సభ్యుల ప్రమాణం.. నేడు 10 మంది రాజ్యసభ సభ్యుల ప్రమాణస్వీకారం.. రేపు 11 మందితో ప్రమాణం చేయించనున్న రాజ్యసభ చైర్మన్.
నేడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారం.
నేడు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్.. విశాఖపట్నం వేదికగా రాత్రి 7. 30 గంటలకు మ్యాచ్..
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday