What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* ఐపీఎల్‌లో నేడు రాజస్థాన్ రాయల్స్‌తో గుజరాత్ టైటాన్స్ ఢీ.. జైపూర్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్
* తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,740… 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,760.. కిలో వెండి ధర రూ.87,900
Also Read
- Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
- 100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
- LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
- 42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
* హైదరాబాద్: తెలంగాణలో నేటితో ముగియనున్న టెట్ దరఖాస్తుల గడువు.. టెట్‌కు ఇప్పటి వరకు లక్షా 95,135 దరఖాస్తులు
* పల్నాడు: నేడు 12వ రోజు వైసీపీ ‘మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. ఉదయం 9 గంటలకు గంటావారిపాలెం నుంచి జగన్ బస్సు యాత్ర ప్రారంభం.. పుట్టవారిపాలెం, సంతమాగులూరు క్రాస్, రొంపిచర్ల క్రాస్, విప్పెర్ల, నెకరికల్లు మీదుగా యాత్ర.. దేవరంపాడు క్రాస్ వద్ద భోజన విరామం.. కొండమోడు, పిడుగురాళ్ల బైపాస్ మీదుగా సాగి.. మధ్యాహ్నం 3.30 గంటలకు అయ్యప్పనగర్ బైపాస్ దగ్గర బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం జగన్.. కొండమోడు జంక్షన్, రాజుపాలెం, రెడ్డిగూడం మీదుగా రాత్రి ధూలిపాళ్ల దగ్గర బస కేంద్రానికి చేరుకోనున్న సీఎం వైఎస్ జగన్
* నేడు, రేపు గోదావరి జిల్లాల్లో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్.. నేడు.. తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో.. రేపు పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో ఉమ్మడి ప్రచారం
* పశ్చిమ గోదావరి: నేడు తణుకు, నిడదవోలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల ఉమ్మడి ప్రచారం.. 4 గంటలకు తణుకు సభలో పాల్గొన్న చంద్రబాబు, పవన్.. అనంతరం తణుకు నుంచి నిడదవోలు వరకు జరగనున్న రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి.. నిడదవోలు గణేష్ చౌక్ లో జరగనున్న బహిరంగ సభలో పాల్గొన్న ముగ్గురు నేతలు.. సభ అనంతరం నిడదవోలులోని తిరుమల సాయి కళ్యాణమండపంలో బస చేయనున్న చంద్రబాబు.. రాజమండ్రి హోటల్లో బస చేయనున్న పవన్.
* జగిత్యాల జిల్లా: నేడు జగిత్యాలకి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ని పరామర్శించనున్న కేసీఆర్.. ఇటీవలే మరణించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తండ్రి.. 13వ రోజు కార్యక్రమంలో భాగంగా నేడు మధ్యాహ్నం 12 గంటలకు హనుమంతు రావు చిత్రపటానికి నివాళులర్పించనున్న కేసీఆర్
* నేడు సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం.. ఓపెన్ టాప్ జీప్ పైన గల్లీ టూ గల్లీ ప్రచారం చేయనున్న కిషన్ రెడ్డి.. మధ్యాహ్నం వరకు తార్నాక, మెట్టుగూడ డివిజన్లలో ప్రచారం.. సాయంత్రం ఖైరతాబాద్ డివిజన్ లో ప్రచారం..
* ప్రకాశం : ఒంగోలులో దళితుల ఆత్మీయ సమావేశం, ముఖ్య అతిథిగా హాజరుకానున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..
* ప్రకాశం: నాగులుప్పలపాడులో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగు నాగార్జున..
* ప్రకాశం: సంతనూతలపాడు మండలం పేర్నమిట్టలో టీడీపీ, జనసేన, బీజేపీ సమన్వయ కమిటీ సమావేశం, హాజరుకానున్న మూడు పార్టీల నేతలు..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో వెంకటాచలం మండల నేతలతో సమావేశం అవుతారు
* నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసిపి లోక్ సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి.. కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి
* నెల్లూరు: కలిగిరిలో ఇంటింట ప్రచారం నిర్వహించనున్న నెల్లూరు టిడిపి లోక్ సభ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి.. ఉదయగిరి టిడిపి అభ్యర్థి సురేష్
* నెల్లూరు రూరల్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న టిడిపి అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
* అంబేద్కర్ కోనసీమ జిల్లా: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అమలాపురం పర్యటన ఖరారు.. రేపు రాత్రి 7 గంటలకు అమలాపురం చేరుకోనున్న చంద్రబాబు.. అమలాపురం గడియార స్తంభం సెంటర్ లో రాత్రి 8.30 వరకు జరగనున్న బహిరంగ సభలో ప్రసంగించనున్న చంద్రబాబు. రాత్రికి కిమ్స్ మెడికల్ కళాశాలలో బస చేయనున్న చంద్రబాబు.
* అనంతపురం : గుంతకల్ రూరల్ పరిధిలోని కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో ఉగాది ఉత్సవాలలో భాగంగా ఇవాళ స్వామివారి ఉత్సవమూర్తుల రథోత్సవ కార్యక్రమం
* అనంతపురం : ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన. కదిరి , శింగమమల , తాడిపత్రిలలో బాలయ్య ఎన్నికల ప్రచారాలు.
* కడప : నేడు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వినుకొండ ప్రాంతంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్న రాయచోటి టిడిపి ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్…
* తిరుమల: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 55,756 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 17,866 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.2.71 కోట్లు
* కర్నూలు: నేడు కోడుమూరు శ్రీ వల్లెలాంబ దేవి ఆలయంలో పారువేట వసంతోత్సవంతో ముగియనున్న ఉత్సవాలు
* అనంతపురం : కళ్యాణదుర్గం పట్టణంలో నేడు అక్కమ్మ గార్ల జాతర.
* అనంతపురం : డి.హీరేహాళ్ మండలం మురడి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.
* నంద్యాల: నేటితో శ్రీశైలంలో ముగియనున్న ఉగాది మహోత్సవాలు.. ఉదయం శ్రీస్వామివారి యాగశాలలో ఉగాది మహోత్సవాల పూర్ణాహుతి.. సాయంత్రం నిజాలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్న శ్రీభ్రమరాంబికాదేవి.. అశ్వవాహనంపై పూజలందుకోనున్న ఆది దంపతులు.. వాహనసేవల అనంతరం శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తుల ఆలయ ప్రదక్షిణ.. శ్రీస్వామి అమ్మవారి ఆలయ ప్రాకారోత్సవంతో ఉగాది ఉత్సవాలు ముగింపు
* కర్నూలు: నేడు ఆస్పరి మండలం కైరుప్పలలో పిడకల సమరం.. శ్రీ వీరభద్ర స్వామి కాళికాదేవి మధ్య సంప్రదాయంగా వస్తున్న పిడకల సమరం… పిడికల సమరానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్న పోలీసులు.. భారీ ఎత్తున పాల్గొనున్న భక్తులు.
తాజావార్తలు
-
Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
-
Dhanush’s ‘OM’ : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ “ఓమ్”.. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
-
Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
-
Suriya – Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
ట్రెండింగ్
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!