NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

నేడు విజయవాడలో మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్ పర్యటించనున్నారు.

ఈరోజు నెల్లూరులో మంత్రి సవిత పర్యటించనున్నారు.

ఈరోజు శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీస్వామి అమ్మవారి స్వర్ణరథోత్సవం నిర్వహించనున్నారు. గంగాధర మండపం నుండి నంది మండపం వరకు స్వర్ణరథంలో విహరిస్తూ భక్తులకు శ్రీస్వామి అమ్మవారు దర్శనమివ్వనున్నారు.

కర్నూలులోని కోడుమూరులో శ్రీ చౌడేశ్వరిదేవి తిరునాళ్ల మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.

నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్ మూనట్ వారి ఆధ్వర్యంలో ఆర్థోపెడిక్ వాక్‌థాన్‌ నిర్వహించనున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్థోపెడిక్ వాక్‌థాన్‌ జెండా ఊపి ప్రారభించనున్నారు.

ఇవాళ ఉదయం బీజేపీ గ్రేటర్ కార్పొరేటర్‌లతో కిషన్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. గ్రేటర్ సమస్యలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రేటర్ కార్పొరేటర్‌ల ప్రచారం, జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో అనుచరించాల్సిన వ్యూహంపై చర్చ జరగనుంది.

ఈరోజు ఉదయం 11 గంటలకి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఢిల్లీ విజయోత్సవం సంబరాలు జరగనున్నాయి.

నేడు బీఆర్‌ఎస్‌ ఆఫీసులో బీసీ నేతల సమావేశం జరగనుంది. 42 శాతం బీసీ రిజర్వేషన్, కులగణన అంశంపై భేటీ జరగనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీసీ నేతల సమావేశం జరగనుంది.

సీఎం రేవంత్‌ రెడ్డి శనివారం కేరళకు వెళ్లారు. ఈరోజు జరగనున్న ‘మాతృభూమి ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ లెటర్స్‌ ఇన్‌ కేరళ’ అనే కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.