NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న అనంతరం సీఎం ఢిల్లీకి వెళ్లనున్నారు.

బెజవాడలో నేడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంకు నారా భువనేశ్వరి హాజరుకానున్నారు.

సీఐడీ నోటీసుపై స్టే ఇవ్వాలని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టు విచారణ జరపనుంది.

సినీ నటుడు పోసాని కృష్ణ మురళి క్వాష్ పిటిషన్లు మీద నేడు ఏపీ హైకోర్టు విచారించనుంది. తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని పోసాని 5 పిటిషన్లు దాఖలు చేశారు.

వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై నేడు ఎస్సీ, ఎస్టీ కోర్టు విచారణ జరపనుంది. వంశీ కిడ్నాప్ కేసులో అరెస్టై రిమాండులో ఉన్న విషయం తెలిసిందే.

నేడు మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో శ్రీ రాఘవేంద్రస్వామి 430వ జన్మదిన వేడుకలు జరగనున్నాయి.

తూర్పుగోదావరి జిల్లాలో ఏడు శాఖల సమన్వయంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరగనున్నాయి.

ఇవాళ విజయవాడకు మాజీ కేంద్రమంత్రి మురళీధరన్ రానున్నారు. విద్యార్ధులకు వన్ నేషన్’-వన్ ఎలక్షన్’పై సెమినార్‌కు ముఖ్య అతిథిగా మురళీధరన్ హాజరుకానున్నారు.

నేడు మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది.

నేడు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నారు.

కరీంనగర్, మెదక్, నిజామాబాద్, అదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాన్ని ప్రకటించేందుకు నేడు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది.

మహిళల ప్రిమియర్‌ లీగ్‌లో నేడు యూపీ వారియర్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య మ్యాచ్ జరగనుంది.