NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

నేడు గుంటూరులో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటించనున్నారు. గుంటూరు మెడికల్ కాలేజీలో అఖిలభారత, అవయవ దాతల సంఘం ఐదవ మహాసభకు ముఖ్యఅతిథిగా మంత్రి హాజరుకానున్నారు.

ఈరోజు నారావారిపల్లెలో ఎమ్మెల్యే పులివర్తి నాని‌‌‌ జాబ్ మేళ నిర్వహించనున్నారు.

ఇవాళ రెవెన్యూ, రిజిస్ర్టేషన్, స్టాంప్స్ శాఖామంత్రి అనగాని సత్యప్రసాద్ సమక్షంలో సీసీఎల్ఏ సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు మంగళగిరి సీసీఎల్ఏ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లతో పాటు ఆ జిల్లాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు.

నేడు ఐఐటీ హైదారాబాద్ క్యాంపస్‌కి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లనున్నారు. ఆస్ట్రేలియా- భారత్ క్రిటికల్ మినరల్ రీసెర్చ్ హబ్ వర్క్ షాపుని డిప్యూటీ సీఎం ప్రారంభించనున్నారు. నేడు, రేపు వర్క్ షాప్ జరగనుంది.

నేడు సంగారెడ్డి జిల్లాలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పర్యటించనున్నారు. వామపక్ష ప్రత్యామ్నాయ రాజకీయాలు నేటి అవసరం అనే సెమినార్లో పాల్గొననున్నారు.

నేడు ఖమ్మంలో కేఏ పాల్ సమావేశం నిర్వహించనున్నారు. సర్పంచ్ పదవులతో పోటీ పడనున్న వారితో కేఏ పాల్ సమావేశం కానున్నారు.

నేడు ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నారు.

నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి దామోదర రాజనర్సింహ, TGIIC చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభిృవృద్ధి కార్యక్రమాల్లో నేతలు పాల్గొననున్నారు.

కాంగ్రెస్ పార్టీ నేటి నుంచి ‘జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగ’ పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఈ ప్రచారం అన్ని నియోజిక వర్గాలు, జిల్లాలు ఇంకా రాష్ట్ర స్థాయిల్లో ప్రారంభమవుతుందని కాంగ్రెస్ ప్రకటించింది.

బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా , భారత్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ జరుగుతోంది. సిడ్నీ వేదికగా చివరి టెస్టు నేడు ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన భారత్ బ్యాటింగ్‌ ఎంచుకుంది.

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అధ్యయనోత్సవాలలో భాగంగా నాలుగవ రోజు అయిన నేడు నరసింహవతారంలో భక్తులకు స్వామివారు దర్శనమివనున్నారు.

 

Show comments