నేడు ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
నేటితో వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ ముగియనుంది. ఇవాళ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరిపి జైల్లో వంశీని పోలీసులు అప్పగించనున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు ఉండవల్లిలోని గాదె రామయ్య – సీతారావమ్మ ఎంపీయూపీ స్కూల్లో చంద్రబాబు, లోకేష్ ఓటు వేయనున్నారు.
నేడు శ్రీశైలంలో భ్రమరాంబ, మల్లికార్జున స్వాముల వారికి మహా రథోత్సవం జరగనుంది.
శ్రీకాళహస్తిలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నేడు ఉదయం రథోత్సవం జరగనుంది.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టీబీఎం మిషన్ సహాయ చర్యలకు అడ్డంకిగా మారింది. మిషన్ వెనకాల పెద్ద ఎత్తున మట్టి, బురద ఉండడంతో రెస్క్యూ బృందాలు ముందుకు వెళ్లలేకపోతున్నాయి.
నేడు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు బీఆర్ఎస్ బృందం వెళ్లనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా నేడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. రావల్పిండి క్రికెట్ స్టేడియంలో మధ్యాహ్నం 2.30కు మ్యాచ్ ఆరంభం కానుంది.
మహిళల ప్రిమియర్ లీగ్ మూడో సీజన్‌లో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.