Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

నేడు ఢిల్లీలో వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ కానున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఉదయం 10.30 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ కానున్న సీఎం

ఏపీ నుంచి ఖాళీ అయిన నాలుగవ రాజ్యసభ స్ఖానాన్ని భర్తీ చేసే అంశంపై నేడు నిర్ణయం.. నామినేషన్ పత్రాల దాఖలుకు ఈ నెల 29వ తేదీ తుది గడువు

ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అధ్యక్షతన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ తొలి సమావేశం.. సమావేశానికి హాజరుకానున్న పీఏసీ సభ్యులు

నేటి అర్ధరాత్రి నుండి గోదావరి డెల్టా పరిధిలోని మూడు ప్రధాన కాలువలకు సాగునీటి సరఫరా నిలిపివేత.. మళ్లీ జూన్ ఒకటో తేదీ నుండి డెల్టాలోని మూడు కాలువలకు సాగునీరు విడుదల

తిరుమలలో ఇవాళ ఆన్‌లైన్‌లో ఉదయం 10 గంటలకు జూలై నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లు విడుదల.. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టిక్కెట్లు విడుదల

అన్నవరం దేవస్థానం వివాదాలపై నేడు విచారణ చేయనున్న అదనపు కమిషనర్ చంద్రకుమార్.. కొండపై ఈఓ కుమారుడు పెత్తనం ఉంటుందని ఫిర్యాదు చేసిన ఉద్యోగులు

నేడు విజ‌య‌న‌గ‌రం జిల్లాలో పర్యటించనున్న జ‌ల‌వ‌న‌రుల శాఖామంత్రి నిమ్మ‌ల రామా నాయుడు

పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో హిందూసంస్థల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

నేడు అనంతపురం జిల్లా కోర్టుకు మరోసారి బోరుగడ్డ అనిల్.. 2018లో అనంతపురం పట్టణంలోని రామచంద్ర నగర్ చర్చికి సంబంధించిన ఆదాయం లెక్కింపు విషయంలో అప్పటి సీఐ మురళీ కృష్ణను దూషించడాని కేసు నమోదు

ఈరోజు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల చేయనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలు విడుదల

నేడు యాదాద్రి జిల్లాలో పర్యటించనున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. వలిగొండ మండల కేంద్రంలో భూ భారతి అవగాహన సదస్సుకు హాజరుకానున్న మంత్రి పొంగులేటి

సూర్యాపేట, యాదాద్రి జిల్లాలలో పర్యటించనున్న సివిల్ సప్లై, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న మంత్రి

నేటి నుంచి 2 రోజులు సౌదీలో ప్రధాని మోడీ పర్యటన.. సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు మోడీ పర్యటన

ఐపీఎల్ 2025: ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్.. భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం

 

Exit mobile version