NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

ఆలూరులో నిరుద్యోగ యువతి, యువకులకు ఈరోజు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. జాబ్ మేళాలో ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే ౠర్ల రామాంజనేయులు పాల్గొననున్నారు.

నేడు శ్రీశైలంలో రెండవరోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఆలయంలో శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజ జరగనుంది.

ఈరోజు ఆదికవి నన్నయ యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్సలర్‌గా ప్రసన్న శ్రీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏపీలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు చేపడుతున్న తొలి ఎస్టీ మహిళగా అరుదైన గుర్తింపు.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని బర్డ్ ఫ్లూ ప్రభావిత పౌల్ట్రీ ఫారాలను కేంద్ర ఆరోగ్య శాఖ వైద్యుల బృందం నేడు సందర్శించనుంది. తణుకు మండలం వేల్పూరు, ఉంగుటూరు మండలంలోని బాదంపూడి, పెరవలి మండలంలోని కానూరు అగ్రహారం కోళ్ల ఫారాలను అధికారులు పరిశీలించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో బేటి కానున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు కేంద్ర వ్యవసాయ శాఖ అధికారులతో చంద్రబాబు సమావేశం కానున్నారు.

నేడు మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్ విజయవాడలో పర్యటించనున్నారు.

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్ పై నేడు ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది.

నేడు పాలకొండకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెళ్లనున్నారు. వైసీపీ సీనియర్ నాయకుడు, కీర్తిశేషులు పాలవలస రాజశేఖరం కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

నేడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉపముఖ్యమంత్రి పర్వెష్ వర్మతో సహా ఆరుగురు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

నేడు మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. నిన్న పార్టీ సమావేశం అనంతరం హైదరాబాద్ నంది నగర్ నివాసంలోనే కేసీఆర్ ఉన్నారు.

ఇవాళ సెక్రటేరియట్‌లో పరిశ్రమల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు.

నేడు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేరళ పర్యటించనున్నారు.

టెక్‌ దిగ్గజం యాపిల్‌ ‘ఐఫోన్‌ 16ఈ’ని భారత మార్కెట్‌లోకి పరిచయం చేసింది. బేస్‌ మోడల్‌ 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ ధర రూ.59,900గా నిర్ణయించింది.

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో భాగంగా నేడు దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో భారత్‌ ఢీకొట్టనుంది. మధ్యాహ్నం 2.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, స్పోర్ట్స్‌-18లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.