NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈదుపురంలో దీపం పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. దీపం పథకంతో కోటి 50 లక్షల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి.

నేడు ఏలూరు ద్వారకా తిరుమల మండలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఐయస్ జగన్నాధపురం శ్రీ లక్ష్మీనరసింహస్వామిని పవన్ దర్శించుకోనున్నారు. అనంతరం దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేయనునున్నారు.

నేటి నుంచి తూర్పుగోదావరి జిల్లా రేషన్ షాపుల్లో కందిపప్పు, పంచదార, జొన్నలు పంపిణీ చేయనున్నారు. పాయింట్లకు సరిపడా సరుకులను ఇప్పటికే పౌరసరఫరాలశాఖ రవాణా చేసింది. రేషన్ కార్డ్ దారులందరికీ ఉచిత బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, జొన్నలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

శ్రీ సత్యసాయి జిల్లాలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు ధర్మవరం పట్టణంలోని పాండురంగ స్వామి ఆలయాన్ని సందర్శించి.. 9:30 నిమిషాలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.

2024 దీపావళి నుంచి సంవత్‌ 2081 ఆరంభం కానుంది. దేశమంతా నిన్న దీపావళి జరుపుకోగా.. నేడు స్టాక్‌ ఎక్స్ఛేంజీలు మూరత్‌ ట్రేడింగ్‌ నిర్వహించనున్నాయి. అంటే శుక్రవారం మార్కెట్లు పూర్తి స్థాయిలో పనిచేయవు. సాయంత్రం ఓ గంట పాటు మాత్రం ప్రత్యేక ట్రేడింగ్‌ సెషన్‌ జరుగుతుంది.

రోజూ వినియోగించే క్రెడిట్‌ కార్డులతో పాటు రైలు టికెట్‌ బుకింగ్‌ విషయంలో ఐఆర్‌సీటీసీ కొత్త మార్పులూ నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. క్రెడిట్‌ కార్డు ప్రయోజనాల్లో కోతలు, నగదు బదిలీలో మార్పులు, రైలు టికెట్‌కు సంబంధించి కొత్త నిబంధనలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.

నేటి నుంచి ముంబైలో న్యూజిలాండ్‌తో భారత్ మూడో టెస్ట్ ఆడనుంది. స్వదేశంలో 12 ఏళ్ల తర్వాత భారత్ సిరీస్‌ ఓటమిని ఎదుర్కొంది. మూడు టెస్టుల సిరీస్‌లో రెండు టెస్టుల్లో ఓడి మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో మూడో టెస్టులో గెలిచి పరువు కాపాడుకోవాలి భారత్ చూస్తోంది.