* నేడు తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన.. తూకివాకంలోని ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ యూనిట్ పరిశీలన.. మధ్యాహ్నం కపిలతీర్థం ఆలయానికి సీఎం చంద్రబాబు.. అనంతరం ప్రజావేదికలో సీఎం చంద్రబాబు ప్రసంగం.. సాయంత్రం 4గంటలకు అలిపిరి కంచి పీఠం సందర్శన..
* నేడు విజయవాడకు ఎంపీ మిథున్ రెడ్డి.. లిక్కర్ కేసులో సిట్ ముందుకు రానున్న మిథున్ రెడ్డి..
* నేడు గుంటూరులో మంత్రి నారా లోకేష్ పర్యటన.. బండ్లమూడి గార్డెన్స్ లో సీఏ విద్యార్దులతో మెగా కాన్ఫరెన్స్ లో పాల్గొనున్న లోకేష్..
* నేడు ఏలూరు జిల్లాలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పర్యటన.. కొయ్యలగూడెంలో సుపరిపాలనకు తొలిఅడుగు కార్యక్రమంలో పాల్గొంటారు.. అనంతరం ఏలూరు చేరుకుని కలెక్టరేట్ లో అధికారులతో సమీక్షిస్తారు..
* నేటి నుంచి కాకినాడ కలెక్టరేట్ లో ప్లాస్టిక్ వాడకం నిషేదం.. ఉద్యోగులు ఎవరైనా సరే ప్లాస్టిక్ వినియోగిస్తే ఆరోజు సీఎల్ గా విధింపు.. స్టీల్ వాటర్ బాటిల్స్ మాత్రమే వినియోగించాలని నిర్ణయం..
* నేటి నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మరో రెండు వేల మందికి క్యూ లైన్లు ఏర్పాటు..
* నేడు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీ..
* నేడు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ.. మధ్యాహ్నం 2గంటలకు రాష్ట్ర ఆదాయం పెంపుపై సబ్ కమిటీ భేటీ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశం..
* నేడు సంగారెడ్డి జిల్లాలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ పర్యటన.. ఐఐటీ హైదరాబాద్ 14వ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న అశ్విని వైష్ణవ్..
* నేడు నిజామాబాద్ లో రాష్ట్ర ఆర్థిక సంఘం పర్యటన.. ఛైర్మన్ రాజయ్య నేతృత్వంలోని సభ్యులతో కలిసి ఆర్థిక సంఘం నిజామాబాద్ లో పర్యటన..
* నేడు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం.. ఏపీలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు..
* నేడు భారత్- ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య రెండో వన్డే.. లార్డ్స్ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకి మ్యాచ్ ప్రారంభం..
