Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

నేడు కర్నూలులో పలు అభివృద్ధి పనులకు మంత్రి టీజీ భరత్ శంకుస్థాపన చేయనున్నారు.

నేడు కాళహస్తీశ్వర స్వామీ బ్రహ్మోత్సవాలపై హోంమంత్రి అనిత సమీక్షించనున్నారు. మధ్యాహ్నం అధికారులతో భద్రత ఎర్పాట్లపై సమీక్ష ‌‌‌నిర్వహించనున్నారు.

నేడు కృష్ణా జిల్లాలో జనసేన ఆత్మీయ సమావేశం జరగనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరగనుంది.

మంత్రి నారాయణ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయలు వెంకటాచలం మండలం స్వర్ణ భారత్ ట్రస్ట్ లో జరిగే వెంకయ్య నాయుడు మనవడి వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొంటారు.

తాడిపత్రి నియోజక వర్గం శ్రీ అశ్వర్థ క్షేత్రంలో మాఘమాసం 3వ ఆదివారం సందర్భంగా శ్రీ అశ్వర్థ నారాయణస్వామి, శ్రీ భీమలింగేశ్వర స్వామి వారికి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

నేడు సిద్దిపేట జిల్లాలో మల్కాజ్​గిరి ఎంపీ ఈటల రాజేందర్ పర్యటించనున్నారు. గజ్వేల్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎంపీ ఈటల పాల్గొననున్నారు.

నేడు వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి పాల్గొననున్నారు.

Exit mobile version