NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

నేడు నాల్గవ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం జరుగుతుంది. కడపలో త్రాగునీటి సమస్య, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, తణుకులో ఈఎస్ఐ ఆసుపత్రి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, గిరిజన గ్రామాలలో కనీస సదుపాయాలు, విద్యాశాఖలో ఖాళీలు.. అంశాలపై చర్చలు జరగనున్నాయి.

నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబు మధ్యాహ్న ఒంటి గంటలకు బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు.

నేడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంగారెడ్డికి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుల బృందంతో కలిసి సంగారెడ్డి జైలులో అక్రమంగా నిర్బంధించిన కొడంగల్ నియోజకవర్గం లఘుచర్ల గ్రామ రైతులను ఆయనను పరామర్శించనున్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు కురుస్తోంది. వరుసగా రెండోరోజు గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) తీవ్ర స్థాయికి చేరుకుంది. గురువారం ఉదయం వరకు 428గా నమోదైంది. దీంతో కట్టడి చర్యల్లో భాగంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ (GRAP) 3 అమలు చేస్తున్నట్లు ఎయిర్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ కమిషన్‌ పేర్కొనింది.

ఝార్ఖండ్‌, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనున్నారు.

బిర్సా ముండా గౌరవార్థం స్మారక నాణెం మరియు తపాలా స్టాంపును నేడు పీఎం నరేంద్ర మోడీ ఆవిష్కరిస్తారు.

నేడు శ్రీశైలంలో పాతాళగంగలో కృష్ణమ్మకు నదీహారతి, జ్వాలాతోరణ మహోత్సవం జరగనుంది. అలానే ఆలయ పుష్కరిణిలో లక్ష దీపోత్సవం జరగనుంది.

కార్తీక పౌర్ణమి సందర్బంగా వేములవాడ రాజన్న ఆలయంకు భక్తులు పోటెత్తారు. ఆలయం ముందు భక్తులు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. సాయంత్రం ఆలయం ముందు భాగంలో జ్వాలా తోరణం ఉంటుంది.

నేడు భక్తి టీవీ ‘కోటి దీపోత్సవం’లో 7వ రోజు. సాయంత్రం 5.30 గంటలకు ఎన్టీఆర్‌ స్టేడియంలో కార్తీక దీపారాధన జరగనుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా విశేష కార్యక్రమాలు జరగనున్నాయి.

టీ20 సిరీస్‌పై కన్నేసిన భారత్ ఆఖరిదైన నాలుగో టీ20లో నేడు దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది. 2-1 ఆధిక్యంతో సిరీస్‌ కోల్పోయే అవకాశం లేని స్థితిలో ఉన్న సూర్య సేన.. రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు సొంతగడ్డపై సిరీస్‌ చేజారనివ్వకూడదని దక్షిణాఫ్రికా పట్టుదలగా ఉంది. జొహానెస్‌బర్గ్‌లో రాత్రి 8.30 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది.